టివీ 9 వ్యవస్థాపకుడు, మాజీ సీఈవో రవిప్రకాశ్ కస్టడీ పిటిషన్ పై నాంపల్లి కోర్టులో వాదనలు ముగిశాయి. టివీ 9 కొత్త యాజమాన్యానికి తెలియకుండా వివిధ చెల్లింపుల పేరుతో రూ.18 కోట్లు తీసుకున్న అభియోగంపై ఆయనను అరెస్టు చేశారు. ఆయన ప్రస్తుతం రిమాండ్ లో ఉన్నారు. రవిప్రకాశ్ నుంచి ఇంకా సమాచారం రాబట్టాల్సి ఉందని, అందువల్ల ఆయనను తమ కస్టడీకి ఇవ్వాలని పోలీసుల తరపు న్యాయవాది కోర్టుకు విన్నవించారు. ఆయనను కస్టడీలోకి తీసుకుని విచారిస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వస్తాయని పోలీసులు అంటున్నారు. అందువల్ల 10 రోజుల పోలీసు కస్టడీకి అనుమతివ్వాలని వారు న్యాయస్థానాన్ని కోరారు. ఇరు వైవులా వాదనలు విన్న న్యాయ స్థానం తీర్పును రేపటికి వాయిదా వేసింది.
previous post