32.7 C
Hyderabad
March 29, 2024 11: 28 AM
Slider మహబూబ్ నగర్

ఆర్మీ రిక్రూట్ మెంట్ ర్యాలీ అర్హత అభ్యర్ధులకు రాత పరీక్ష

#army recrurment rally

2021 మార్చి 5వ తేదీ నుండి 24వ తేదీ వరకు నిర్వహించిన ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ ర్యాలీలో అర్హత సాధించిన అభ్యర్థులకు రెండు విడతల్లో రాత పరీక్ష నిర్వహించనున్నట్లు రక్షణ శాఖ పౌర సంబంధాల విభాగం ఆర్మీ రిక్రూట్మెంట్ డైరెక్టర్ కన్నల్ మనోజ్ ఏపీ ఒక ప్రకటనలో తెలిపారు.  

ఈ రాత పరీక్షలు జులై 25 న మొదటి విడత, ఆగస్టు 29న రెండవ విడత రాత పరీక్షను నిర్వహించనున్నట్లు తెలిపారు. మొదటి విడత రాతపరీక్ష కామన్ ఎంట్రెన్స్ ఎగ్జామ్ సీఈఈ సోలో టెక్ సాంకేతిక విభాగం వారికి జూలై 25వ తేదీన 529 ఫీల్డ్ వర్క్ షాప్, సికింద్రాబాద్ నందు రాతపరీక్ష నిర్వహించనున్నారు.

రెండో విడత రాతపరీక్ష సోల్జర్ GD RT JCO సిపాయి విభాగం వారికి ఆగస్టు 29వ తేదీన పెరేడ్ గ్రౌండ్ ఆర్టీ సెంటర్, హైదరాబాద్ నందు రాత పరీక్ష నిర్వహించనున్నారు.

ఆర్మీ రిక్రూట్మెంట్  మొదటి విడత రాత పరీక్షకు హాజరయ్యే వారు జూలై 8వ తేదీ నుండి జులై 15వ తేదీ వరకు, రెండో విడత రాతపరీక్ష కు హాజరయ్యే వాటు ఆగస్టు 9 నుండి ఆగస్టు 14వ తేదీ వరకు సికింద్రాబాద్ ఆర్మీ రిక్రూట్‌మెంట్‌ కార్యాలయంలో ఏఆరోఓ కు వ్యక్తిగతంగా హాజరై రిపోర్ట్ చేయాలని ఆర్మీ రిక్రూట్మెంట్ అధికారి  ఒక ప్రకటనలో  సూచించారు.

నారాయణపేట జిల్లా నుండి ఆర్మీ ర్యాలీలో అర్హత సాధించిన యువకులు రాత పరీక్షకు సకాలంలో వ్యక్తిగతంగా  రిపోర్ట్ చేసి సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.

Related posts

డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఘనంగా చేగువేరా 54 వ వర్ధంతి

Satyam NEWS

జగన్ క్యాబినెట్: మళ్లీ మారిన సమీకరణాలు

Satyam NEWS

బేతపూడిలో రైతులు రైతుకూలీలు నిరసన

Sub Editor

Leave a Comment