Slider జాతీయం

రిజిగ్నేషన్: హిందువులను వేటాడి చంపినా మాట్లాడరా

Arnab-Goswami

మహారాష్ట్రలో ఇద్దరు సాదువులను, ఒక కారు డ్రైవర్ ను అత్యంత కిరాతకంగా కొందరు యువకులు కొట్టి చంపిన సంఘటనపై ఎలాంటి ప్రతిస్పందన వ్యక్తం చేయని మీడియా అధిపతులకు, మీడియా సంస్థలకు చెంప పెట్టులాంటి సంఘటన ఇది.

స్వలాభం కోసం పని చేయడం తప్ప దేశ మీడియా అవసరాల కోసం పని చేయని ఎడిటర్స్ గిల్డ్ నుంచి తాను తప్పుకుంటున్నట్లు రిపబ్లిక్ టివి వ్యవస్థాపకుడు, ప్రముఖ టీవీ జర్నలిస్టు అర్నబ్ గోస్వామి ప్రకటించారు. దేశంలో హిందువులు కాని వారిపై ఏ మాత్రం చిన్న సంఘటన జరిగినా వామపక్ష మేధావులు, జర్నలిస్టు ముసుగులో ఉన్న వారు, సినీ పరిశ్రమలో పెద్దలుగా చెలామణి  అవుతున్నవారు పెద్ద పెద్ద గొంతులతో అరచి గోల చేస్తారు.

అయితే ఇద్దరు సాదువులను వెంటాడి వేటాడి కర్రలతో కొట్టి పోలీసుల ఎదురుగానే చంపేస్తే ఏ మీడియా కూడా కనీసం వార్త కూడా కవర్ చేయలేదని అర్నబ్ గోస్వామి ప్రపంచం దృష్టి కి తీసుకువచ్చారు. ఎడిటర్స్ గిల్డ్ కు చైర్మన్ గా ఉన్న వామపక్ష మేధావి శేఖర్ గుప్తా పై ఆయన నిప్పులు చెరిగారు. మహారాష్ట్రలో అత్యంత కిరాతకంగా జరిగిన ఇద్దరు స్వాముల హత్య ఎవరికి కనిపించలేదా అని ఆయన ప్రశ్నించారు. మీడియాలో ఒక వర్గానికి సంబంధించిన వార్తలనే ప్రసారం చేస్తూ మరో వర్గం వార్తలను తొక్కిపెట్టే సాంప్రదాయం అన్యాయమని అర్నబ్ గోస్వామి తెలిపారు. మహారాష్ట్రలో ఈ నెల 16న జరిగిన ఈ దారుణ సంఘటనను పూర్తి వివరాలతో సత్యం న్యూస్ నిన్న పోస్టు చేసిన విషయం పాఠకులకు తెలుసు.

Related posts

మందు బాబులకు షాక్

Murali Krishna

గోదావరి నదిలో దూకి యువతి ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

తిరుమలలో సామాన్య భక్తులకు పెద్దపీట

Satyam NEWS

Leave a Comment