38.2 C
Hyderabad
April 25, 2024 14: 57 PM
Slider చిత్తూరు

తిరుచానూరు లో దర్శన ఏర్పాట్ల పర్యవేక్షణ

#Tiruchanur Temple

తిరుచానూరు అమ్మవారి ఆలయంలో చేస్తున్న దర్శన ఏర్పాట్లును టీటీడీ తిరుపతి జెఈఓ బసంత్ కుమార్ నేడు పరిశీలించారు. నేటి నుంచి ఆలయ దర్శనాలకు అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ సడల్లింపు ఇవ్వడంతో చిత్తూరు జిల్లా తిరుచానూరు లో అమ్మవారి దర్శనం కు వచ్చే భక్తులకు చేసిన ఏర్పాట్లును టీటీడీ తిరుపతి జెఈఓ బసంత్ కుమార్ ఇంజినీరింగ్ అధికారులు, ఆలయ అధికారులు,అర్చకులతో కలిసి ఆయన పరిశీలించారు.

ఈ సందర్భంగా జె ఈ ఓ మాట్లాడుతూ ప్రతి ఒక్కరు ఆన్లైన్ లో దర్శనంకు టోకెన్ తీసుకుని, ఆలయానికి వచ్చే వారు తప్పని సరిగా మాస్కులు ధరించాలని కోరారు. కేంద్ర ప్రభుత్వం గైడ్ లైన్స్ ప్రకారం పది సంవత్సరాలు లోపు వారు, 65 సంవత్సరాలు పైన బడిన వారు ఆలయానికి రాకుడదని విజ్ఞప్తి చేశారు.

ప్రతి రెండు గంటలకు ఆలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్లు సానీటైజ్ చేసే విధంగా ఏర్పాట్లు చేశామన్నారు. గంటకు 250 మందిని దర్శనానికి పంపేవిధంగా టోకెన్స్ జారీ చేస్తామని ఆయన తెలియజేశారు.

Related posts

బ్రెజిల్‌లో విరిగిపడ్డ కొండ చరియలు

Sub Editor

నష్టపోయిన రైతులకు వెంటనే పరిహారం అందించాలి

Satyam NEWS

ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టంపై అవగాహన కల్పించాలి

Satyam NEWS

Leave a Comment