జమ్మూ కాశ్మీర్ స్వతంత్ర ప్రతిపత్తి ని కేంద్ర ప్రభుత్వం రద్దు చేసింది. రాజ్యాంగాన్ని సవరించకుండానే కేంద్ర ప్రభుత్వం ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ద్వారా కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేయడం వివాదాలకు దారి తీసింది. కాశ్మీర్ స్వయం ప్రతిపత్తిని రద్దు చేసే ఆర్డర్ ను కేంద్ర హోం మంత్రి అమిత్ షా రాజ్యసభలో చదివి వినిపించారు. అనంతరం మధ్యాహ్నం 12 గంటలకు అమిత్‌షా లోక్‌సభలో ప్రకటన చేసే అవకాశం కనిపిస్తోంది. కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ప్రతిపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. రాజ్యసభలో తీవ్ర గందరగోళం చెలరేగుతున్నది. ఈ ఎగ్జిక్యూటీవ్ ఆర్డర్ ను కొద్ది సేపటి కిందట జరిగిన కేంద్ర మంత్ర వర్గం ఆమోదించింది.
previous post