28.2 C
Hyderabad
December 1, 2023 17: 43 PM
Slider జాతీయం

ఎయిమ్స్ లో చేరిన అరుణ్ జైట్లీ

arun jaitly

కేంద్ర మాజీ ఆర్థికమంత్రి, బీజేపీ అగ్ర నేత అరుణ్‌ జైట్లీ ఆసుపత్రిలో చేరారు. గుండెపోటు రావడంతో ఆయనను ఢిల్లీలోని ఎయిమ్స్‌కు తరలించినట్టు తెలుస్తోంది. అయితే జైట్లీకి గుండెపోటు రాలేదని వైద్యపరీక్షల నిమిత్తం మాత్రమే వచ్చారంటూ బీజేపీ నేతలు స్పష్టం చేస్తున్నారు. ఇకపోతే ఎయిమ్స్ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్న అరుణ్ జైట్లీని కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి హర్షవర్థన్ పరామర్శించారు. అరుణ్ జైట్లీ ఆరోగ్య పరిస్థితిని వ్యైద్యులను అడిగి తెలుసుకున్నారు. వైద్యపరీక్షల నిమిత్తం అరుణ్ జైట్లీ ఆస్పత్రిలో చేరినట్లు వైద్యులు తెలిపారు. శ్వాసతీసుకోవడంలో ఇబ్బంది పడుతుండటంతో ఆయనకు వైద్యం అందిస్తున్నట్లు వైద్యులు తెలిపారు. గత కొంతకాలంగా అరుణ్ జైట్లీ అనారోగ్యంతో బాధపడుతున్నారు. మోదీ మెుదటిసారి ప్రధాని అయిన తర్వాత ఆయన కేబినెట్లో గతంలో ఆర్థికమంత్రిగా  ఉన్నపుడే అరుణ్‌ జైట్లీ తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఈ నేపథ్యంలో అమెరికాలో ఆయనకు కిడ్నీ మార్పిడి ఆపరేషన్‌ కూడా చేయించుకున్నారు. 2019 సార్వత్రిక  ఎన్నికల్లో బీజేపీ ఘన  విజయం సాధించిన అనంతరం కూడా ఆయన ఎలాంటి పదవులను ఆశించలేదు. అనారోగ్యం  కారణంగా తనను కేంద్రమంత్రి వర్గంలోకి తీసుకోవద్దని ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ సైతం రాశారు.  అయినప్పటికీ ప్రధాని నరేంద్రమోదీ అరుణ్ జైట్లీని బ్రతిమిలాడారు. నేరుగా అరుణ్ జైట్లీ నివాసానికి వెళ్లి మరీ మాట్లాడారు. ఆయనకు విశ్రాంతి అవసరమని నిర్ధారించుకున్న తర్వాత ఆయనను మంత్రి వర్గంలో తీసుకోలేదు. ఇకపోతే ఆనాటి నుంచి మీడియా ముందుకు గానీ, పార్టీ కార్యక్రమాలకు గానీ దూరంగా ఉంటున్నారు అరుణ్ జైట్లీ. అయితే సోషల్ మీడియాలో మాత్రం చాలా యాక్టివ్ గా ఉంటున్నారు.

Related posts

కువైట్ లో షార్ట్ సర్క్యూట్ తో ఇద్దరి మృతి

Satyam NEWS

ప్రొఫెసర్ కోదండరామ్ గెలుపే లక్ష్యంగా పనిచేయాలి

Satyam NEWS

సింహవాహిని

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!