25.2 C
Hyderabad
March 23, 2023 00: 50 AM
Slider జాతీయం

అరుణ్ జైట్లీ అంత్యక్రియలు పూర్తి

813813-arun-jaitley-3

కేంద్ర మాజీ ఆర్థిక మంత్రి, బీజేపీ సీనియర్‌ నేత అరుణ్ జైట్లీ అంత్యక్రియలను ఆదివారం అధికార లాంఛనాలతో పూర్తి అయ్యాయి. ఢిల్లీలోని నిగమ్‌  బోధ్‌ ఘాట్‌లో పలువురు కేంద్ర మంత్రులు, బీజేపీ నేతలు, ప్రముఖుల సమక్షంలో జైట్లీ అంత్యక్రియలు అధికారిక లాంఛనాలతో జరిపించారు. అంతకుముందు అరుణ్‌ జైట్లీ పార్ధివదేహానికి రాష్ట్రపతి కోవింద్‌, హోంమంత్రి అమిత్ షా, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియాగాంధీ సహా పలువురు రాజకీయ ప్రముఖులు నివాళులు అర్పించారు. ఇక దివంగత నేత భౌతికకాయాన్ని  స్వగృహం నుంచి బీజేపీ ప్రధాన కార్యాలయానికి తరలించారు. అక్కడ బీజేపీ జాతీయ అధ్యక్షుడు అమిత్‌ షా, వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ జేపీ నడ్డా, ఇతర నాయకులు, శ్రేణులు జైట్లీ భౌతికకాయానికి నివాళులర్పించారు.   మరోవైపు విదేశీ పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ జైట్లీ మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. జైట్లీ భార్య, కుమారుడితో మాట్లాడి ప్రగాఢ సానుభూతి తెలిపారు.  66 సంవత్సరాల అరుణ్‌జైట్లీ అనారోగ్యంతో ఈ నెల 9 నుంచి ఎయిమ్స్‌లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచిన విషయం తెలిసిందే. జైట్లీ గత కొద్దిరోజులుగా ఊపిరితిత్తుల సమస్య, అరుదైన కేన్సర్‌తో బాధపడ్డారు.

Related posts

ప‌ఠాన్‌లో స‌రైన శ‌రీర ఆకృతి కోసం శాయ‌శ‌క్తులా కృషి చేసిన షారుఖ్‌

Bhavani

కౌలు రైతు కుటుంబానికి పవన్ కళ్యాణ్ రూ.లక్ష ఆర్ధిక సాయం

Satyam NEWS

ద‌ట్ట‌మైన అట‌వీ ప్రాంతంలో అడుగు పెట్టిన స‌త్యం న్యూస్.నెట్

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!