22.2 C
Hyderabad
December 10, 2024 10: 46 AM
Slider ఆధ్యాత్మికం

అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ టూర్ ప్యాకేజీ

#arunachalam

కార్తీక పౌర్ణ‌మి సంద‌ర్భంగా అరుణాచ‌లేశ్వ‌రుని గిరి ప్ర‌దక్షిణ‌కు వెళ్లే భ‌క్తుల‌కు ఆర్టీసీ శుభ‌వార్త‌ ప్రకటించింది. ప‌ర‌మ‌శివుడి ద‌ర్శ‌నం కోసం అరుణాచ‌లం గిరి ప్ర‌ద‌క్షిణ టూర్ ప్యాకేజీని TGSRTC యాజ‌మాన్యం ప్ర‌క‌టించింది. ఈ ప్యాకేజీలో కాణిపాకం వ‌ర‌సిద్ధి వినాయ‌క‌స్వామితో పాటు వెల్లూరులోని గోల్డెన్ టెంపుల్‌ను సంద‌ర్శించే సౌక‌ర్యాన్ని సంస్థ క‌ల్పిస్తోంది. తెలంగాణ‌లోని హైద‌రాబాద్, ఆదిలాబాద్, నిజామాబాద్, మెద‌క్, న‌ల్ల‌గొండ‌, వరంగ‌ల్, క‌రీంన‌గ‌ర్, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ నుంచి అరుణాచ‌లానికి ప్ర‌త్యేక బ‌స్సుల‌ను న‌డుపుతోంది. ఈ నెల 15న కార్తీక పౌర్ణ‌మి కాగా, 13 నుంచి ఆయా ప్రాంతాల నుంచి ప్ర‌త్యేక బ‌స్సులు బ‌య‌లుదేరుతాయి. కాణిపాకం, గొల్డెన్ టెంపుల్ ద‌ర్శ‌నం త‌ర్వాత కార్తీక  పౌర్ణ‌మి పర్వ‌దినం నాడు అరుణాచ‌లానికి చేరుకుంటాయి. అరుణాచ‌ల గిరి ప్ర‌దక్షిణ ప్యాకేజీని www.tgsrtcbus.in వెబ్‌సైట్‌లో బుక్ చేసుకోవ‌చ్చు. పూర్తి వివ‌రాల‌కు టీజీఎస్ఆర్టీసీ కాల్ సెంట‌ర్ నంబ‌ర్లు 040-23450033, 040-69440000 సంప్ర‌దించ‌గ‌లరు.

Related posts

ప్రభుత్వాలను ఆడిస్తున్న కార్పొరేట్ కాలేజీ మాఫియా

Satyam NEWS

కొత్త ఏడాది లో తొలి రోజునే విద్యల నగరంలో కొత్తగా ట్రాఫిక్ ఇక్కట్లు…!

Satyam NEWS

ఎన్నారై టీడీపీ నేతల నిత్యావసర వస్తువుల పంపిణీ

Satyam NEWS

Leave a Comment