33.2 C
Hyderabad
April 25, 2024 23: 09 PM
Slider క్రీడలు

చెస్ ప్లేయర్ అరుష్ బత్తుల కు మంత్రి ఎర్రబెల్లి అభినందనలు

#arushbattula

చదరంగం ఆటలో రాణిస్తున్న ఆరుష్ బత్తుల ను రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి గ్రామీణ మంచినీటి సరఫరా శాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు అభినందించి, ఆశీర్వదించారు. హైదరాబాద్ లోని మంత్రుల నివాసంలో ఆరుష్ మంత్రి ని కలిశారు. చిన్న వయసులోనే చదరంగం ఆటలో మంచి ప్రావీణ్యం  కనబరచడం పట్ల మంత్రి సంతోషం వ్యక్తం చేశారు. మరింతగా రాణించి, రాష్ట్రానికి దేశానికి మంచి పేరు తేవాలని ఆకాంక్షించారు. ఆరుష్ ని మంత్రి ktr కి కలిపిస్తామని చెప్పారు. కాగా ఆరుష్ ఇటీవల ఇండోనేషియాలో జరిగిన అండర్ 8 ఏషియన్ యూత్ చెస్ ఛాంపియన్‌షిప్‌లో 5వ స్థానంలో నిలిచాడు. హైదరాబాద్‌లో జరిగిన ఆల్ ఇండియా ఫిడే (FIDE) రేటింగ్ టోర్నమెంట్‌లో అండర్ 9 విభాగంలో 2వ స్థానాన్ని దక్కించుకున్నాడు. 

Related posts

నల్గొండలో నర్సింగ్ అధికారుల కొవ్వొత్తి ర్యాలీ

Satyam NEWS

పెరిగిన ధరలు

Sub Editor 2

డాక్టర్ చదలవాడ ను పరామర్శించిన మాజీ మంత్రి కాసు

Bhavani

Leave a Comment