37.2 C
Hyderabad
April 19, 2024 14: 24 PM
Slider నెల్లూరు

విద్యార్థులకు పరీక్షా సామాగ్రి అందచేసిన ఆర్య వైశ్య సంఘం

పదవ తరగతి పరీక్షలు రాయబోతున్న వెయ్యి మంది విద్యార్థులకు పరీక్ష సామగ్రిని పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా అర్బన్ ఆర్యవైశ్య సంఘం అందచేసింది. ముక్కాల ద్వారకానాథ్ మిత్రమండలి ఆధ్వర్యంలో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి వద్ద ఉంచి పూజ చేసిన ప్యాడ్,పౌచ్చు,పెన్, పెన్సిల్, ఎరేజర్, షార్పనరు, హాల్టికెట్ పెట్టుకునేందుకు పౌచ్ వగైరా లను విద్యార్థుల కు అందచేశారు. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు ముక్కాల ద్వారకానాథ్ చేతుల మీదగా వీటిని విద్యార్థులకు సరఫరా చేశారు. విద్యార్థిని విద్యార్థులు పరీక్ష సామగ్రిని ఉపయోగించు కొని పరీక్షలు బాగా రాయాలని కోరుకుంటున్నట్లు నెల్లూరు అర్బన్ ఆర్యవైశ్య సంఘం ట్రెజరర్ గాదం శెట్టి కిషోర్ తెలిపారు.

.

Related posts

సైబర్ నేరాల నిరోధానికి జిల్లాలోని అన్ని పోలీస్ స్టేషన్లలో సైబర్ వారియర్లు

Satyam NEWS

జిహెచ్ఎంసి ఎన్నికల్లో గెలుపే ధ్యేయంగా పని చెయ్యాలి

Satyam NEWS

సెప్టెంబర్ 2,3 తేదీలలో స్పెషల్ క్యాంపైన్

Bhavani

Leave a Comment