36.2 C
Hyderabad
April 18, 2024 12: 07 PM
Slider జాతీయం

భారత్ జోడో యాత్రకు ఆరేళ్ల ఆర్యమాన్ మద్దతు

#BharatJodoYatra

‘‘నేను మీ భారత్ జోడో యాత్రకు మద్దతు ఇస్తున్నాను’’ ఈ మాటలు అన్నది ఎవరో రాజకీయ నాయకుడు కాదు. రాజకీయ పార్టీకి చెందిన వ్యక్తి కూడా కాదు. ఆరేళ్ల ఆర్యమాన్ భారత్ జోడో యాత్ర చేస్తున్న రాహుల్ గాంధీకి చెప్పిన మాట ఇది. భారత్ జోడో యాత్ర మధ్యప్రదేశ్ మీదుగా రాజస్థాన్‌లోకి ప్రవేశించింది. రాహుల్ గాంధీ యాత్ర మధ్యప్రదేశ్‌లోని అగర్ జిల్లాలో సుస్నేర్ చేరుకుంది. ఈ సమయంలో రాజ్‌గఢ్ జిల్లాలోని ఖిల్చిపూర్‌కు చెందిన ఆరేళ్ల ఆర్యమాన్ తన తండ్రి ప్రవీణ్ వర్మతో కలిసి రాహుల్ గాంధీని కలవడానికి వచ్చాడు. పాదయాత్ర ప్రారంభించేందుకు ఉపక్రమించిన రాహుల్ గాంధీని చూసి బిగ్గరగా ‘అంకుల్’ అని పిలిచాడు. అది రాహుల్‌కి వినిపించింది.

అక్కడే ఉన్న కాంగ్రెస్ సహచరుడు జీతూ పట్వారీకి ఆ పిల్లాడిని చూపిస్తూ తన వద్దకు తీసుకురావాలని కోరాడు. పట్వారీ చిన్నారిని ఎత్తుకుని రాహుల్ వద్దకు తీసుకెళ్లాడు. ఆ చిన్నారి పేరు అడగ్గా ఆర్యమాన్ అని చెప్పాడు. చిన్నారి తన చేతులోని చాక్లెట్ రాహుల్ గాంధీకి ఇచ్చాడు. నా కోసం చాక్లెట్ ఎందుకు తీసుకొచ్చావు అని రాహుల్ ప్రశ్నించగా.. భారత్ జోడో యాత్రకు నేను మద్దతిస్తున్నానని చిన్నారి చెప్పింది. నేను ఎప్పుడూ పేపర్‌లో ఫోటోలు చూస్తుంటాను, మిమ్మల్ని కలవాలనుకున్నాను. మీరు చాలా నడుస్తున్నారు, కాబట్టి నేను మీ శక్తి కోసం చాక్లెట్ తెచ్చాను అని చెప్పాడు. అది విన్న రాహుల్ నవ్వుకున్నాడు. ఆ చిన్నారితో ఫొటో కూడా దిగాడు.

Related posts

ఇసుక రవాణాను అడ్డుకోవద్దని ఆదేశం

Satyam NEWS

కరోనా నియంత్రణ లో ఏపి ప్రభుత్వం విఫలం

Satyam NEWS

ఏప్రిల్ 22 నుండి ఇంటర్ పరీక్షలు

Sub Editor 2

Leave a Comment