37.2 C
Hyderabad
April 18, 2024 21: 45 PM
Slider నిజామాబాద్

ఆశ వర్కర్ల సమస్యలు అసెంబ్లీలో ప్రస్తావించాలి

#Aasha Workers

రాష్ట్ర ప్రభుత్వం రానున్న అసెంబ్లీ సమావేశం లో ఆశ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ ఆధ్వర్యంలో శుక్రవారం జుక్కల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్ర మెడికల్ అధికారి డాక్టర్ ప్రశాంత్ కు ఆశ కార్యకర్తలు వినతిపత్రం అందజేశారు.

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా విధులు నిర్వహిస్తున్న ఆశలకు రాష్ట్రంలోని అన్ని జిల్లాల మెడికల్ అధికారులు ఆన్లైన్ లో సర్వే చెయ్యాలని ఆశల పైన ఒత్తిడి చేస్తున్నారని, ప్రభుత్వం ఇప్పటివరకు ఆశలకు సెల్ ఫోన్లు ఇవ్వకుండానే సర్వే చెయ్యాలని ఇబ్బందులు పెట్టడం సరైన పద్ధతి కాదని అన్నారు.

కనీసం ఈ అంశాన్ని గమనించకుండా జిల్లా, మండల స్థాయిలోని అధికారులు ఆశలపై ఒత్తిడి చెయ్యడం అన్యాయం అని సి ఐ టి యు జుక్కల్ జోన్ కన్వీనర్ సురేష్ గొండ తెలిపారు.

ఆశల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చే అసెంబ్లీ సమావేశంలో ఆశాలందరికి నెలకు 10వేల పిక్స్ డ్ వేతనం నిర్ణయించాలని ఆ లోపు 7500రూపాయలను తగ్గకుండా పారితోషికం చెల్లించాలని, ఆశ కార్యకర్తలందరికీ డబుల్ బెడ్ రూమ్ లు మంజూరు చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఏ ఎన్ ఎం నియామకాల్లో ఆశలకు 10%వేటేజ్ మార్కులు కలపాలని, కరోనా ఇన్సూరెన్స్ 50లక్షలు అమలు చెయ్యాలని పెన్షన్, ఈ ఎస్ ఐ, ఉద్యోగ భద్రత కల్పిస్తూ వారికి అవసరమైన రిజిస్టర్ లను వెంటనే సరఫరా చెయ్యాలని గత సంవత్సరం సెప్టెంబర్ 25న జాయింట్ సమావేశం సందర్బంగా ఇచ్చిన హామీలు అమలు చేస్తూ, కరోనా సందర్బంగా కొత్తగా పనిలోకి తీసుకున్న హేల్త్ వాలంటీర్ లను ఆశలుగా కొనసాగిస్తూ 11 డిమాండ్లను పరిష్కరించి ఆశలకు న్యాయం చెయ్యాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమం లో ఆశ కార్యకర్తల మండల అధ్యక్షురాలు పుష్ప, ఉపాధ్యక్షురాలు భాగ్యరేఖ, కార్యదర్శి భాగ్యశ్రీ, జె. గంగామణి. నాగమణి. లలిత. సురేఖ.రుక్మిణి. సునంద. లక్ష్మి. శైలజ, స్వరూప, తదితరులు పాల్గొన్నారు.ఎస్ ఎఫ్ ఐ జిల్లా అధ్యక్షుడు కాంబ్లే అజయ్, కోలా నారాయణ తదితరులు పాల్గొన్నారు.

Related posts

దళితుడికి గుండు కొట్టించిన సినీ దర్శకుడు

Satyam NEWS

పుచ్చలపల్లి సుందరయ్య జీవితం నేటి తరానికి స్పూర్తిదాయకం

Satyam NEWS

గుడ్ న్యూస్:కరోనా చికిత్స బిల్లు సింగపూర్ ప్రభుత్వానిదే

Satyam NEWS

Leave a Comment