40.2 C
Hyderabad
April 24, 2024 18: 05 PM
Slider మెదక్

దేశ వ్యాపిత సమ్మెలో భాగంగా దుబ్బాకలో ఆశ వర్కర్ల నిరసన

#asha workers

ఈ రోజు దేశ వ్యాప్తంగా ఆశ వర్కర్ల ఒక రోజు సమ్మెలో భాగంగా దుబ్బాక మండలంలోని వివిధ గ్రామాల ఆశావర్కర్లు సమ్మె చేశారు. ఆశావర్కర్లు సిఐటియు ఆధ్వర్యంలో ప్లకార్డులతో నిరసన ప్రదర్శన నిర్వహించారు.

అనంతరం సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి జి.భాస్కర్ మాట్లాడుతూ ఆశ వర్కర్లు తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలకు సేవ చేస్తున్నారని గుర్తు చేశారు. కానీ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ సేవలను గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రస్తుతం రెండవ వేవ్ సందర్భంగా ఆశ వర్కర్లు దేశంలో అనేక మంది మరణించారని వాళ్ల కుటుంబాలకు వెంటనే 50లక్షల ఎక్స్గ్రేషియా ను వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఆశ వర్కర్ లను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించి కనీస వేతనం 21 వేల రూపాయలు,పెన్షన్, ఇ ఎస్ ఐ, ఎక్స్ గ్రేషియా మరియు వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు.

దేశంలోని ప్రజలందరికీ కోవేడ్ నియంత్రణ చర్యలను కేంద్ర ప్రభుత్వం తక్షణమే చేపట్టి ప్రజలు అందరికీ ఉచితంగా కరోనా వ్యాక్సిన్ అందించాలని ఆశలను ప్రభుత్వ ఉద్యోగుల గుర్తించాలని పనికి అదనపు వేతనం చెల్లించాలని, ఆశ వర్కర్లలందరికీ మాస్కులు శానిటైజర్ పిపిఈ కిట్లు ప్రభుత్వమే అందించాలని డిమాండ్ చేశారు.

ప్రత్యేకమైన సెలవులను కూడా అమలు చేయాలని వీటితో పాటు ఆన్లైన్ సర్వే కొరకు ఆశ వర్కర్లకు స్మార్ట్ ఫోన్లు అందిస్తామని ఇప్పటికీ అందించడం లేదని వెంటనే స్మార్ట్ ఫోన్లను, రిజిస్టర్స్,యూనిఫామ్స్, పెండింగ్ సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు.

ప్రభుత్వం ప్రకటించిన పి ఆర్ సి ప్రకారంగా వెంటనే ఆశాలకు పీఆర్సీ గైడ్ లైన్స్ జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యల పరిష్కారం కొరకు దేశవ్యాప్తంగా ఈ రోజు ఒకరోజు సమ్మె చేస్తున్నామని ఈ సందర్భంగా ప్రభుత్వం స్పందించి సమస్యలు పరిష్కరించాలని లేనియెడల భవిష్యత్తు లో దీర్ఘకాలిక సమ్మెకు పిలుపు తీసుకుంటామని ప్రభుత్వాలను హెచ్చరించారు.

ఈ కార్యక్రమంలో ఆశావర్కర్లు శారద,శ్యామల, భారతి, సుజాత ,దేవలక్ష్మి ,పోశవ్వ, లత, పద్మ తదితరులు పాల్గొన్నారు.

Related posts

మౌంట్ ఎల్బర్న్ పర్వతాన్ని అధిరోహించిన ములుగు వాసి

Satyam NEWS

ప్రపంచ రికార్డు కోసం మహిషాసుర మర్ధని స్తోత్ర గానం

Satyam NEWS

మంత్రి పదవుల కోసం ఎదురు చూపులు: ఇంకెతకాలం ఇలా?

Satyam NEWS

Leave a Comment