33.2 C
Hyderabad
April 26, 2024 02: 45 AM
Slider ముఖ్యంశాలు

కరీముల్లా ! నీ ప్రార్ధనలే ఈ సమాజాన్ని కాపాడాలి

#RamzanPrayers

పవిత్ర రంజాన్ ఉపవాసాలు చేయవద్దని ఎవరూ అనడం లేదు. రంజాన్ ప్రార్ధనలు చేయవద్దని ఎవరూ అనడం లేదు. అయ్యా ఇప్పుడు పరిస్థితులు బాగాలేవు, కరోనా అనే వ్యాధి ఒకరి నుంచి ఒకరికి అంటుకుంటున్నది, అందువల్ల దూరంగా ఉండి మీ మీ పనులు చేసుకోండి అని చెబుతున్నారు వైద్య నిపుణులు.

అయినా చాలా మంది వినడం లేదు. మాకు మత ప్రాధాన్యత తప్ప వేరేది ఏదీ తెలియదు అన్నట్లుగా ప్రవర్తిస్తున్నారు చాలా మంది. కానీ గుంటూరు లాలాపేట పోలీస్ స్టేషన్ ఏ ఎస్ ఐ కరీముల్లా ను చూడండి. దయచేసి ఆయన ఏం చేస్తున్నారో చూడండి. ఆయన గుంటూరు రెడ్ జోన్ లో విధినిర్వహణలో ఉన్నాడు.

రంజాన్ ఉపవాసం ఉంటున్నాడు. ఉపవాస విరమణకు ముందు ప్రత్యేక దువా చేస్తున్న దృశ్యం ఇది. ఒక్కడే రోడ్డు పక్కన జేబులోని కర్చిఫ్ ను పరచుకుని ఎంతో శ్రద్ధగా ప్రార్ధన చేస్తున్నాడు. ప్రతి ఒక్కరూ ఈ విధంగా అందరూ చేస్తే కరోనా వల్ల ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఉండదు.

గుంపులు గుంపులుగా షాపింగ్ చేయడం, సామూహికంగా ప్రార్ధనలు చేయడం, నోటికి మూతికి కవర్ లేకుండా తిరగడం వద్దని చెబుతున్నది అందరూ పాటించాలి. అప్పుడే రంజాన్ పండుగలా సాగుతుంది.

Related posts

ఈ నెల 30 నుంచి శ్రీ శేష దాసుల ఆరాధనోత్సవాలు

Satyam NEWS

విద్వేషం: స్వేరోస్ ప్రవీణ్ కుమార్ పై కేసు నమోదుకు కోర్టు ఆదేశాలు

Satyam NEWS

ఈటల బిజెపి ప్రవేశం ఎవరికి లాభం? ఎవరికి నష్టం?

Satyam NEWS

Leave a Comment