వివిధ గ్రూపులకు చెందిన తీవ్రవాదులు ఒకే సారి పెద్ద సంఖ్య లో లోగిపోయిన ఘటన అసోం ల జరిగింది.దేశ చరిత్రలోనే రికార్డు స్థాయిలో ఒకే రోజు అసోం రాష్ట్రంలో పలు తీవ్రవాద సంస్థలకు చెందిన 644 మంది మిలిటెంట్లు గురువారం సీఎం సర్బానంద సోనోవవాల్ సమక్షంలో లొంగిపోయారు. అసోంలో నిషేధిత ఉల్ఫా1, ఎన్డీఎఫ్‌బీ, ఆర్ ఎన్ ఎల్ ఎఫ్, కేఎల్ వో, సీపీఐ మావోయిస్టు, ఎన్ఎస్ఎల్ ఏ, ఏడీఎఫ్, ఎన్ ఎల్ ఎఫ్ బీ తీవ్రవాద సంస్థలకు చెందిన 644 మంది తీవ్రవాదానికి స్వస్థి చెప్పి పోలీసుల ముందు లొంగిపోయారు.
లొంగిపోయిన తీవ్రవాదులు పోలీసులకు 177 తుపాకులను అప్పగించారు.అసోం డిజిపి భాస్కర్ జ్యోతి మహంత మీడియా తో మాట్లాడుతూ అసోం పోలీస్ చరిత్రలోనే ఈ రోజు ని ముఖ్యమైనది గా భావిస్తున్నామని,ఇంట పెద్ద సంఖ్య లో మిలిటెంట్ గ్రూప్ సభ్యులు లొంగిపోవడం హర్షణీయమని అన్నారు.దీనితో శాంతి భద్రతల సమస్య తగ్గు ముఖం పడుతుందని అయన ఆశ భావం వ్యక్తం చేశారు.