23.7 C
Hyderabad
September 23, 2023 09: 52 AM

Astrology

Satyam NEWS

    జ్యోతిష్య శాస్త్రవేత్త గురించి క్లుప్తంగా
    సత్యం న్యూస్. నెట్ లో జ్యోతిష్యాన్ని అందిస్తున్న వారు సత్ సంగీ బ్రదర్స్ ఆస్ట్రో బ్యూరో (పిఏఎన్ మూర్తి అండ్ సన్స్). సత్ సంగీ బ్రదర్స్ 1937 నుంచి జ్యోష్యానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ ను అందిస్తున్నారు. ఉన్నత సాంకేతికత ను అభివృద్ధి చెందిన పద్ధతులను ఉపయోగించి జ్యోతిష్యానికి సంబంధించిన ప్రిడిక్షన్స్ ను అందించడంలో సత్ సంగీ బ్రదర్స్ పేరు పొందారు. అత్యద్భుతమైన శాస్త్రపరిజ్ఞానం వినియోగించి సాధ్యమైనంత నిక్కచ్చిగా ప్రిడిక్షన్స్ ఇవ్వడంలో సత్ సంగి బ్రదర్స్ పేరు పొందారు. 1937 నుంచి వంశపారంపర్యంగా జ్యోతిష్య శాస్త్రాన్ని అవలంబిస్తూ వస్తున్న సత్ సంగీ బ్రదర్స్ మీ భవిష్యత్తుకు సంబంధించిన విషయాలను ఇక్కడ క్లుప్తంగా వివరిస్తారు. మీ జాతకాన్ని కచ్చితంగా చెప్పాలంటే మీరు కచ్చితమైన సమాచారం ఇవ్వాల్సి ఉంటుంది. మీరు ఇచ్చే సమాచారంలో వ్యత్యాసం ఉంటే భవిష్యత్తు చెప్పడంలో కూడా తేడా వస్తుంది. పూర్తి జాతకం చదవాలంటే మీరు సరైన సమాచారాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. పూర్తి సమాచారాన్ని ఇచ్చిన తర్వాత మీ భౌతిక, మానసిక పరిస్థితిని ముందుగా అంచనావేసి చెబుతారు. అవి సరిపోలితే ఆ తర్వాత మీకు గతంలో కలిగిన అనుభవాలను చెబుతారు. అవి కూడా మ్యాచ్ అయితే భవిష్యత్తు గురించి చెబుతారు. జాతకం చెప్పడం అనేది అనేక అంశాలపై ఆధారపడి ఉంటుందని గమనించగలరు. ఇది కేవలం మీకు సూచన ప్రాయంగా చెప్పేదే తప్ప కచ్చితంగా జరగలేదు అని అనడానికి అవకాశం లేదు. దయచేసి ఈ విషయాన్ని గమనించండి. సత్యం న్యూస్ కేవలం ప్రాధమిక సమాచారం ఇవ్వడం వరకే పరిమితం అవుతున్నది. మీ ప్రశ్నకు సమాధానం చెప్పడం వరకే సత్యం న్యూస్ కు బాధ్యత తదుపరి విషయాలకు సత్యం న్యూస్ కు ఎలాంటి సంబంధం లేదు.

    error: Content is protected !!