30.7 C
Hyderabad
April 24, 2024 00: 55 AM
Slider ప్రత్యేకం

వీడ్ని మనిషి అందామా? వేరే పేరు పెడదామా?

Mydukuru ATM

కడప జిల్లా మైదుకూరులో జరిగిన ఒక సంఘటన తెలుసుకుంటే మనం మానవులమని అని అనుకుంటేనే అసహ్యం వేస్తున్నది. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న వేళ పబ్లిక్ ప్లేస్ లో వికృత చేష్టలకు పాల్పడిన వీడ్ని ఏం చేయాలో మీరే చెప్పాలి.

మైదుకూరు మండలంలోని ఒక గ్రామానికి చెందిన ఒక యువకుడు మైదుకూరు రాయల్ సర్కిల్ లోని ఎస్ బి ఐ ఏటీఎం కు వచ్చాడు. ఆ సమయంలో ఏ టీ ఎం లో ఎవరూ లేరు. వాడు ఉమ్మిని చేతిలోకి వేసుకున్నాడు. ఏటీఎం డిస్ ప్లే పై పూస్తున్నాడు.

ఏటీఎంలో పని ఉన్న మరి కొందరు వచ్చి బయట క్యూలో నిలబడ్డారు. వాడు బయటకు వస్తే తాము వెళ్లవచ్చునని. అయితే వాడు బయటకు రావడం లేదు. మళ్లీ ఉమ్మి చేతుల్లోకి తీసుకున్నాడు. ఈ సారి నెంబర్లు ఉన్న డిస్ ప్లే బోర్డుపై రాశాడు. మొత్తం ఏటీఎంలో ప్రజలు ఎక్కడెక్కడ చేతులు పెడతారో అక్కడంతా వాడు ఉమ్మి రాస్తున్నాడు.

బయట ఉన్నవాళ్లు చూశారు. వాడేం చేస్తున్నాడో అర్ధమైంది. వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. తక్షణమే పోలీసులు వచ్చి చూశారు. వాడు చేసిన వికృత చేష్ట అర్ధం అయింది. వాడ్ని పట్టుకున్నారు. వాడికి వైద్య పరీక్షలు చేశారు.

వాడికి జ్వరం ఉంది. జలుబు, దగ్గు ఉన్నాయి. వాడు తీవ్ర మైన రోగంతో బాధపడుతున్నాడు. వాడ్ని అదుపులోకి తీసుకుని వైద్య పరీక్షలకు కడప రిమ్స్ కు తరలించారు. ఏటీఎం సెంటర్ కు సీల్ చేశారు ఎవరూ లోపలికి వెళ్లకుండా.   

Related posts

అత్యంత వైభవంగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి శాంతి కళ్యాణం

Satyam NEWS

కడపలో ల్యాబ్ టెక్నీషియన్ ల ఆత్మహత్యాయత్నం

Satyam NEWS

ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై ఆస్ట్రేలియా ఘన విజయం

Sub Editor

Leave a Comment