24.2 C
Hyderabad
July 15, 2024 00: 52 AM
Slider ఆంధ్రప్రదేశ్

12 ఏళ్ల తర్వాత మళ్లీ ఆయేషా మీరా శవపరీక్ష

ayesha-case-685-06-1502014420

12 ఏళ్ల తర్వాత ఆయేషామీరా హత్యకేసు మళ్లీ తెరపైకి వచ్చింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో సంచలనం సృష్టించిన ఫార్మసీ విద్యార్థిని ఆయేషా మీరా హత్య కేసు మొదటి నుంచి పలు మలుపులు తీసుకుంది. నిందితులను గుర్తించడంలో పోలీసులు విఫలమైనట్లు విమర్శలు వెల్లువెత్తాయి.

ఒకవైపు విద్యార్థి, సామాజిక సంఘాలు ఆందోళనలు, మరోవైపు రాజకీయ ఒత్తిడిల మధ్య పోలీసులు శాస్త్రీయ పరిశోధన విస్మరించారనే అపవాదు ఉంది. గుంటూరు జిల్లా తెనాలికి చెందిన షంషాద్‌బేగం, ఇక్భాల్‌భాషాలకు  ఆయేషా మొదటి సంతానం. విజయవాడ సమీపంలోని ఇబ్రహీంపట్నంలో నిమ్రా కళాశాలలో బిఫార్మసీ చదువుతూ స్థానికంగా ఉన్న ప్రైవేటు వసతి గృహంలో ఉండేది.

2007డిసెంబరు 27 ఉదయం ఆమె రక్తపు మడుగులో మరణించి ఉండటాన్ని గుర్తించారు. డిసెంబరు 26 రాత్రి ఆమెను హత్య చేశారని పోలీసులు నిర్థరించారు. ఈ సంఘటన వెలుగులోకి రావడంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. విద్యార్థి సంఘాలు, సామాజిక సంఘాలు ఆందోళనలు చేశాయి.

2008 ఆగస్టు 17న సత్యంబాబును ఒక కేసులో అరెస్టు చేశారు. నందిగామ మండలం అనాసాగరం గ్రామానికి చెందిన సత్యంబాబు గతంలో అదేతరహా నేరాలు చేశాడని చెబుతూ ఆయేషా హత్య తానే చేసినట్లు అతడు అంగీకరించాడని పోలీసులు అరెస్టు చేశారు. అయితే అతను దోషి కాదని తేలింది.

అసలు దోషులు ఎవరో ఇప్పటికీ తేలలేదు. ఈ దశలో కేసు సిబిఐ చేతికి చేరింది. కేసును సీబీఐకి అప్పగించినందున ఆధారాల కోసం మరోసారి శవపరీక్ష నిర్వహించనున్నారు. ఆయేషా మృతదేహానికి మరోసారి శవపరీక్ష నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. శనివారం తెనాలి చెంచుపేట శ్మశానవాటికలో శవపరీక్ష నిర్వహిస్తారు. ఈ సారి అయినా దోషులు ఎవరో తెలుస్తుందో లేదో వేచి చూడాలి.

Related posts

జడ్జిమెంట్: బహిరంగ ప్రదేశంలో తాగినందుకు జైలు శిక్ష

Satyam NEWS

దక్షిణాది రాష్ట్రాలకు తక్లీఫ్ మోసుకొచ్చిన తబ్లిక్ జమాత్

Satyam NEWS

శ్రీవారి సాలకట్ల బ్రహ్మోత్సవాలకు పటిష్ట భద్రత

Satyam NEWS

Leave a Comment