32.2 C
Hyderabad
April 20, 2024 20: 33 PM
Slider తెలంగాణ

క్రిటిసిజమ్: నిరంకుశ పాలనలో మగ్గుతున్న తెలంగాణ

Cheruku Sudakar

ప్రజాస్వామ్య పునాదుల పై  ఆర్టికల్ 3 ద్వారా వచ్చిన తెలంగాణ రాష్ట్రం లో నిరంకుశ పాలన సాగుతోందని తెలంగాణ ఇంటి పార్టీ అధ్యక్షుడు చెరకు సుధాకర్ అన్నారు. విద్యార్ధుల సమస్యలపై ధర్నా చేస్తున్న ఏబీవీపీ, పీడిఎస్ యు విద్యార్ధులు అసెంబ్లీ గేట్ ముట్టుకోవడమే పాపం అన్నట్టుగా, శత్రువులపై దాడి చేసినట్టు పోలీస్ లు లాఠీ చార్జి చేశారని ఆయన అన్నారు.

అది మరచిపోక ముందే ఆశ వర్కర్ల పై పోలీసులు దాడి చేశారని గుర్రాల తో తొక్కించిన చంద్రబాబు కన్నా కేసీఆర్ నిరంకుశంగా ప్రవర్తిస్తున్నారని ఆయన అన్నారు. ముందు అనుమతి తీసుకుని టీచర్లు ఇందిరా పార్కు లో ధర్నా కూర్చొక ముందే అరెస్ట్ చేయటం అన్యాయమని ఆయన అన్నారు. అణచివేత ఇవాళ రేవంత్ వంతు, రేపు అందరి వంతు అవుతుందని ఆయన అన్నారు.

కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డిపై వచ్చిన ఆరోపణలను తేల్చాల్సింది కోర్ట్, అది చేయకుండా సెక్షన్స్ 184, 187 , 287 కింద కేసులు పెట్టారని ఆయన అన్నారు. కేటీఆర్ ఉన్న ఫామ్ హౌస్ లీజ్ ప్రాపర్టీ అయినప్పుడు 187, 184 సెక్షన్ ఎలా అప్లై అవుతుందని ఆయన ప్రశ్నించారు. ఇలా చేస్తే ఇక కోర్ట్ లు ఉంది ఎందుకు అని ఆయన ప్రశ్నించారు. ఈ కార్యక్రమం లో ఇంటి పార్టీ నేతలు దేవేందర్ రెడ్డి, కృష్ణ, గౌస్, కృష్ణ మాదిగ, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఈ నెల 9వ తేదీన తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాలు

Bhavani

జీహెచ్ఎంసీపై బీజేపీ జెండా

Sub Editor

ఇంకా దోపిడీకి గురవుతున్న అణగారిన వర్గాలు

Satyam NEWS

Leave a Comment