32.2 C
Hyderabad
March 28, 2024 22: 08 PM
Slider హైదరాబాద్

మహిళలపై అత్యాచారాలకు పాలకుల వైఫల్యమే కారణం

#katragadda prasuna

రోజు రోజుకి  మహిళలు పై జరుగుతున్న అఘాయిత్యం, హత్యాయత్నం వంటి ఘటనలను నియంత్రణ కోసం మరణశిక్షలాంటి కఠినమైన చట్టాలను తీసుకువచ్చినా సరైన ఫలితాలు ఇవ్వకపోవడానికి ప్రభుత్వ వైఫల్యాలే కారణమని తెలంగాణ తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షురాలు, మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

ఆగ్రహంలో ఉన్న ప్రజలను శాంతపరచడానికి తప్ప అసలు మూలాలను కనుక్కుని పరిష్కరించడంలో పాలకులు శ్రద్ధ చూపడం లేదని ఆమె అన్నారు. 2012 దిల్లీ నిర్భయ రేప్ ఘటన తర్వాత నుంచి ప్రభుత్వం రూపొందించిన చట్టాల వల్ల పరిస్థితిలో మార్పు వస్తుందని అనుకున్నా రేప్ కేసులు పెరుగుతున్నయని ఆమె అన్నారు.

నిర్భయ, దిశ వంటి ఘటనలు మరువక ముందే తెలుగు రాష్ట్రాలలో మహిళల పై  రోజు రోజుకి ఎన్నో ఘోరాలు జరుగుతున్నాయని కాట్రగడ్డ ప్రసూన అన్నారు. ప్రభుత్వం ఇచ్చిన గణాంకాల ప్రకారం 2013 చివరి నాటికి, పెండింగ్‌లో ఉన్న అత్యాచారం కేసుల సంఖ్య 95వేలు. 2019 చివరి నాటికి ఇది 1 లక్ష 45 వేలకు పెరిగింది…2021 నాటికి ఈ స్సంఖ్య రెండు లక్షల కు చేరడం చూస్తుంటే ..రూపొందించిన చట్టాలు  నిందితులను చుట్టలుగా మారాయి అని చెప్పడం లో ఎటువంటి సందేహం లేదని ఆమె అన్నారు.

ఆంధ్రప్రదేశ్ లో రమ్య, అనూష, నరసరావుపేట౼సత్తెనపల్లి మధ్యలో ఒక మహిళ పై బీహార్ కూలీలు అఘాయిత్యం చూస్తుంటే తెలుగు రాష్ట్రంలో భవిష్యత్ ఏమైపోతుందో అని భయం వేస్తోంది అని కాట్రగడ్డ ప్రసూన తన ఆవేదన వ్యక్తం చేశారు. అమ్మాయిలపై అత్యాచారం చేయాలంటే భయపడాలని, అలాగే బాధితులకు, బాధిత కుటుంబాలను సత్వరం న్యాయం అందే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే కాట్రగడ్డ ప్రసూన అన్నారు.

Related posts

వామపక్షల పోరాట ఫలితమే రైతు రుణమాఫీ

Bhavani

ముందస్తు అనుమతుల పేరుతో రెండు కోట్ల రూపాయలు స్వాహా

Satyam NEWS

మీర్ పేట కేసులో 6గురు అరెస్ట్

Bhavani

Leave a Comment