తమిళనాడులోని వేళ్లూరుల దారుణ సంఘటన చోటుచేసుకుంది.వేళ్లూరు పట్టణ కేంద్రం మధ్యలో ఉన్న కోట సమీపంలో రాత్రి 7 గంటల ప్రాంతంలో ఈ అమానుష ఘటన జరిగింది.తన స్నేహితుడితో వచ్చిన మహిళ ను మొదట బెదిరించి వారిపై దాడిచేసారూ. కోట లో 24 ఏళ్ల మహిళను ముగ్గురు వ్యక్తులు కత్తితో బెదిరించి బాదుతూ సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నిందితులు మహిళ బాయ్‌ఫ్రెండ్‌ను చితకబాది ఆ యువతిపై అత్యాచారం చేశారు. అనంతరం వారి వద్ద ఉన్న వస్తువులను కూడా అపహరించుకుపోయారు. అత్యాచారం, దోపిడి కేసులు నమోదు చేసిన పోలీసులు 18 ఏళ్ల వయస్సున ఇద్దరు యువకులను అరెస్ట్ చేశారు. పరారీలో ఉన్న మరొకరి కోసం వెతుకుతున్నట్లు వారు తెలిపారు.