26.7 C
Hyderabad
June 22, 2024 04: 29 AM
Slider కృష్ణ

డాక్టర్ లోకేష్ పై సీఎం భద్రతా సిబ్బంది దాడి గర్హనీయం

#devineniuma

గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్ లో అమెరికా సిటిజన్, ప్రముఖ వైద్యులు డాక్టర్ లోకేష్ పై సీఎం భద్రత సిబ్బంది దాడి  చేయడాన్ని తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాజీ మంత్రి శ్రీదేవినేని ఉమామహేశ్వరరావు తీవ్రంగా ఖండించారు. దాడి విషయం తెలుసుకున్న ఉమా వెంటనే సీనియర్ లాయర్ గూడపాటి లక్ష్మీనారాయణ, మీడియా ఇన్ఛార్జ్ దారపనేని నరేంద్ర, మన్నవ  సుబ్బారావు  ఇతర నేతలతో కలిసి విజయవాడలోని ఎల్ఐసి కాలనీలోని డాక్టర్ లోకేష్ స్వగృహానికి వెళ్లి వారిని పరామర్శించారు.

జరిగిన ఘటన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ గన్నవరం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ లో డాక్టర్ లోకేష్ పై 20 మంది పోలీసులు దౌర్జన్యంగా వ్యవహరించిన తీరు దుర్మార్గం. ఎయిర్ పోర్టులో డాక్టర్ లోకేష్ ని గుర్తు పట్టిన వైసీపీ నాయకులు సీఎం సెక్యూరిటీకి సమాచారం అందించారు. ఒక సీనియర్ డాక్టర్, అమెరికా సిటిజెన్ ను మ్యాన్ హ్యాండిల్ చేసిన అధికారులను సస్పెండ్ చేయాలి.

ఏ రాజకీయ నాయకుడి డైరెక్షన్ లో సీఎం సెక్యూరిటీ అధికారులు ఈ పనిచేశారో స్పష్టం చేయాలి. అమెరికన్ సిటిజన్ అయినా మాతృభూమిపై ప్రేమతో ఇక్కడ జరుగుతున్న దోపిడీ, అరాచకాలపై సోషల్ మీడియాలో స్పందించినందుకే కక్ష కట్టారు. పేరుపొందిన ప్రఖ్యాత వైద్యులు, ఎన్నో సేవా కార్యక్రమాలను చేసిన వ్యక్తి డాక్టర్ లోకేష్. జగన్మోహన్ రెడ్డి లండన్ వెళ్తూ కూడా చేస్తున్న అరాచకాలు పరాకాష్టకు చేరుకున్నాయి. ఎవరి ప్రోత్సాహం, ప్రోద్భలంతో ఈ పనులు జరిగాయి? తక్షణమే బాధ్యులైన పోలీస్ అధికారులను సస్పెండ్ చేయాలి ఉన్నతాధికారులకు సైతం ఫిర్యాదు చేస్తాం. తప్పు చేసిన ఏ అధికారి తప్పించుకోలేడు అని ఆయన హెచ్చరించారు.

Related posts

గ్రీన్ ఛాలెంజ్ లో మొక్కలు నాటిన చిరంజీవి కుమార్తె సుస్మిత

Satyam NEWS

మునిసిపల్ ఓటర్లకు ముఖ్యమంత్రి జగన్ తాజా వల

Satyam NEWS

జీవకోటి ప్రాణాలు తోడేస్తున్న ప్లాస్టిక్ సంచులు

Satyam NEWS

Leave a Comment