Slider మెదక్

ఖాజీపూర్ ముదిరాజ్ మత్య్సకారులపై దౌర్జన్యం

#JangitiMudiraj

సిద్దిపేట జిల్లా బొంపల్లి అక్బర్పేట్ మండల్ ఖాజీపూర్ గ్రామ ముదిరాజ్ మత్స్యకారుల పైన గ్రామస్తులు వీడిసి పేరుతో గత 30 సంవత్సరాలుగా దౌర్జన్యం చేస్తూ చేపలు పట్టకుండా అడ్డుకుంటున్న గ్రామస్తులపైన అధికారులు చర్య తీసుకోవాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర ఉపాధ్యక్షులు జంగిటి శ్రీనివాస్ ముదిరాజ్ డిమాండ్ చేశారు.

ఖాజీపూర్ కు చెందిన కొంతమంది రాజకీయ నాయకులు ముదిరాజ్ మత్స్యకారులను గ్రామ బహిష్కరణకు గురి చేస్తూ చేపలు పట్టుకోకుండా దౌర్జన్యం చేస్తూ 30 సంవత్సరాలుగా గ్రామస్తులు చేపల ఆదాయాన్ని గడిస్తున్నారని ముదిరాజులు మత్స్యకారులు తక్కువ సంఖ్యలో ఉన్నందున ఆ గ్రామస్తులు ప్రభుత్వ చట్టాలను చేతిలోకి తీసుకొని ప్రభుత్వం ఏర్పాటు చేసిన కులవృత్తులను తుంగలో తొక్కి ఒక సామాజిక వర్గం పైనే ఒక కుల వృత్తి పైననే దౌర్జన్యంగా డబ్బులు గ్రామస్తులు దండుకోవడం ఇది ఎంతవరకు సమంజసం అని దీనిపైన ఉన్నదా అధికారులు సమగ్ర విచారణ చేసి చర్యలు తీసుకోవాలని ఖాజీపూర్ ముదిరాజులకు మత్స్య శాఖలో సొసైటీ ఏర్పాటు చేసి సభ్యత్వాలు ఇచ్చినప్పటికీ గ్రామస్తులు సుప్రీమ్ గా భావిస్తూ ఇంతటి దారుణానికి ఒడి కట్టడం సరైన పద్ధతి కాదని ప్రభుత్వాలకి వ్యతిరేకంగా ఆ గ్రామస్తులు నిర్ణయాలు తీసుకొని చట్టాలను సైతం లెక్కచేయకుండా అక్కడి ముదిరాజ్ మచ్చకారులను గ్రామ బహిష్కరణకు గురిచేసి గ్రామంలో ఎవరు కూడా మాట్లాడకుండా చేయడము బెదిరింపులకు పాల్పడడం ప్రాణనాష్టం కల్పిస్తామని చెప్పడము స్వతంత్ర భారతదేశంలో ఇది కరెక్ట్ కాదని తక్షణమే కలెక్టర్ గారు ముదిరాజ్ మత్స్యకారులకు చేపలు పట్టుకొనుటకు అనుమతులు ఇస్తూ ముదిరాజ్ మత్స్యకారులకు రక్షణ ఇవ్వాలని ముదిరాజ్ హక్కుల సాధన సమితి ముదిరాజ్ జేఏసీ రాష్ట్ర కమిటీల ద్వారా కోరుతున్నామని అలా జరగనియెడల జిల్లాలో మొత్తం 370 సొసైటీలు 30 వేల మత్స్యకారులు ఉన్నారని అందరినీ ఏకం చేసి చలో కాజీపూర్ చేపట్టి అక్కడి చెరువుకుంటలో ఉన్న చేపలను పట్టి అక్కడి ముదిరాజ్ మత్స్యకారులకు ఇచ్చి అండగా నిలుస్తామని ఆయన అన్నారు. ఇట్టి కార్యక్రమంలో మత్య్సశాఖ జిల్లా డైరెక్టర్ ఆకారం సతయ్య, యూత్ రాష్ట్ర అధ్యక్షుడు పడిగె ప్రశాంత్, ముదిరాజ్ రాష్ట్ర నాయకులు అరిగే కృష్ణ, కొంతం శ్రవణ్, యాట రాజేష్, గుడిపల్లి వికాస్, కోరబోయిన సుధాకర్, దూలం ముత్యం, గణేష్, రమేష్, నరేశ్, రమేష్, స్వామి తదితర ముదిరాజులు ఉన్నారు.

Related posts

విద్యాశాఖలో కృత్రిమ మేధస్సు ఆధారిత విద్యాబోధన పై సిఎస్ సమీక్ష

mamatha

మోసం చేశాడన్న కోపంతో… సొంత బావ గొంతుకోసిన యువతి!

Satyam NEWS

(CVS) Thc Free Cbd Oil Tru Hemp Cbd Oil Vermont Cbd Hemp Oil Sda

mamatha
error: Content is protected !!