35.2 C
Hyderabad
April 20, 2024 16: 54 PM
Slider మహబూబ్ నగర్

తెలంగాణ లో దళితులపై పెరుగుతున్న దాడులు, దౌర్జన్యాలు

#kollapur dalits

తెలంగాణ  రాష్ట్రంలో దళితులపై  దాడులు, దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయని తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి నర్సింహ్మయ్య పేర్కొన్నారు. ఆదివారం మంత్రి నర్సింహ్మయ్య కొల్లాపూర్ తెలంగాణ మా మాల మహానాడు నూతన కమిటీని ప్రకటించారు.

కొల్లాపూర్ నియోజక వర్గ ఇంచార్జీ బిజ్జ నిరంజన్, కొల్లాపూర్ పట్టణ అధ్యక్షుడు గా మొట్టే క్రాంతి కుమార్ ను  ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా ఆయన  మాట్లాడారు. తెలంగాణలో దళితులపై అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు.అదే విధంగా దాడులు  పెరిగిపోయాయి అన్నారు.

ఉదాహరణకు కొల్లాపూర్ పట్టణంలో రిపోర్టర్ అవుట  రాజశేఖర్ పై పోలీసుల దాడి, అదేవిధంగా మరియమ్మ మరణం, దళిత మహిళ ట్రైనింగ్ ఎస్సై పై  దాడిని గుర్తు చేశారు.

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం దళితుల పట్ల ఏ విధంగా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవాలన్నారు.

మాలలు ఏకతాటిపైకి రావాలన్నారు.ఈ కార్యక్రమంలో  ఉమ్మడి జిల్లా మాల మహానాడు యూత్ అధ్యక్షులు ఏనుపోతుల కర్ణ,జిల్లా కార్యదర్శి కుంత లక్ష్మయ్య,సీనియర్ మొట్టే నరేందర్, మోట్టే శివ, మొట్టె శ్యామ్,రమేష్ తదతరులు పాల్గొన్నారు.

Related posts

28న నిర్వహించబోతున్న పౌర్ణ‌మి గ‌రుడ సేవ ర‌ద్దు

Satyam NEWS

పోచారం ట్రస్ట్ ద్వారా బియ్యం, నిత్యావసర సరుకుల పంపిణీ

Satyam NEWS

ముఖ్యమంత్రి కేసిఆర్ నాయకత్వంలో తెలంగాణ అన్ని రంగాల్లో అభివృద్ధి

Satyam NEWS

Leave a Comment