33.2 C
Hyderabad
April 25, 2024 23: 21 PM
Slider నిజామాబాద్

పేకాట‌రాయుళ్ల‌పై దాడులు భారీగా ప‌ట్టుబడ్డ న‌‌‌గ‌దు

jukkal

కామారెడ్డి జిల్లా జుక్కల్ నియోజకవర్గం దీపావళి పండగ సంద‌ర్భంగా జోరుగా పేకాట న‌డుస్తోంది. కర్నాటక, మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఇక్కడ దీపావళి పండుగ వచ్చిందంటే లక్ష్మీపూజ బాణసంచా ఎంత పేలుతాయో పేకాట కూడా అంతకు రెట్టింపుగా ఉంటుంది. గతంలో పేకాట అడ్డాలు వ్యవసాయ క్షేత్రాలు పొలాల గట్లు వెంట ఉండేది. కానీ ఈ ఏడు ఏకంగా అధికార పార్టీ నాయకుల ఇళ్లను స్థావరాలుగా మార్చడం చర్చనీయాంశమవుతున్నాయి.


స్థానిక అధికారులకు కాకుండా జిల్లా పోలీస్ యంత్రాంగం టాస్క్ఫోర్స్ అధికారులను నియమించి పేకాటపై ఉక్కుపాదం మోపుతున్నారు. రెండు రోజుల క్రితం బిచ్కుంద మండల కేంద్రంలో టాస్క్ పోర్స్ దాడుల్లో 2,77,253.రూపాయలు పట్టుబడ్డ విషయం విదితమే. పండగ నాడు శనివారం జుక్కల్ మండల కేంద్రంలో ఎంపిపి ఇంట్లోనే ప్రజాప్రతినిధి భర్తనే పేకాట నిర్వహించి అభాసుపాలయ్యారు.1,06710రూపాయలు పట్టుబడగా మద్నూర్ మండలంలోని ధన్నూర్ గ్రామంలో రూ. 89,160రూపాయలు పట్టుబడ్డాయని పోలీసులు తెలిపారు.

ఈ మూడు ఘటనల్లో నలభై మందిని పట్టుకోగా వారి వద్ద నుంచి సెల్‌ఫోన్లు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. పిట్లం నిజాంసాగర్, పెద్దకొడప్గల్ మండలాలు కూడా ఈ దాడులు కొనసాగుతున్నాయి. ఈ దీపావళి ధమాకాలో మరి ఎంతమంది పట్టుబడతారో ఎన్నిరూపాయలు నగదును అధికారులు స్వాధీనం చేసుకుంటారు మరో రెండు రోజులు ఎదురుచూడాల్సిందే .

Related posts

వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీసు “స్పందన”

Satyam NEWS

దారితప్పిన బాలుడిని దరికి చేర్చిన విలేకరికి సన్మానం

Satyam NEWS

భారత్‌ బయోటెక్‌ రూపొందించిన ‘ఇన్‌కొవాక్‌’ విడుదల

Satyam NEWS

Leave a Comment