35.2 C
Hyderabad
April 20, 2024 18: 49 PM
Slider ఖమ్మం

మహిళలపై దాడులను నివారించాలి

#mallu

సమాజంలో సగ భాగమైన మహిళలకు విధాన నిర్ణయాల్లో భాగం కల్పించేందుకు మహిళా రిజర్వేషన్ బిల్లు ఆమోదించకుండా తీవ్ర జాప్యం చేస్తున్నాయని,  కేంద్ర, రాష్ట్ర ,పాలకులు, మద్యాన్ని వనరుగా భావిస్తూ రాష్ట్రంలో దేశంలో మత్తుపదార్థాలైన గుడుంబా గంజాయి ప్రోత్సహిస్తున్నారని, వీటి వలన మహిళలకు రక్షణ లేకుండా పోతుందని ఐద్వా రాష్ట్ర కార్యదర్శి మల్లు లక్ష్మి ఆవేదన వెలిబుచ్చారు. ఐద్వా ఖమ్మం జిల్లా వర్క్ షాప్ బండి పద్మ అధ్యక్షతన ఖమ్మం సుందరయ్య భవన్లో జరిగింది  అందులో లక్ష్మి  మాట్లాడుతూ బిజెపి అధికారంలోకి వచ్చాక మహిళల మీద దాడులు, హత్యలు ,హత్యాచారాలు పెరుగుతున్నాయని, దీనికి కారణం బిజెపి పెద్దలు మహిళల వస్త్రధారణ మీద,ఒంటరిగా వివిధ వృత్తులు చేసుకోవడాన్ని తప్పుపడుతూ మాట్లాడుతున్నారని దీన్నికొందరు దుండగులు ఆసరాగా తీసుకుని మహిళల్ని హింసిస్తున్నారని ఆమె అన్నారు .బిజెపి మనుధర్మ శాస్త్రాన్ని అమలు చేస్తూ మహిళలను వంటింటికే పరిమితం కావాలని మహిళల స్వేచ్ఛ స్వతంత్రాలపై అనేక అంక్షలు విధించడం బిజెపిదుర్భివృద్ధికి ని దర్శనం అన్నారు . అన్ని పనుల్లో శ్రమ దోపిడీకి గురవుతున్నది మహిళలే అని ఆమె అన్నారు.

సమాన పనికి సమాన వేతనం ప్రభుత్వమే నిర్ణయించాలని ఆమె డిమాండ్ చేశారు .కేంద్ర ప్రభుత్వం డీజిల్ ,పెట్రోల్, గ్యాస్ ,ధరలు పెంచి అన్ని రకాల నిత్యవసర వస్తువుల ధరలను పెంచి మహిళపై భారాలను మోపిందని. పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని ఆమె డిమాండ్ చేశారు. పెరిగిన ధరలతోటి మహిళలు నిత్యవసర వస్తువులను కొని తినలేక రక్తహీనత తోటి బాధపడుతున్నారని ఆమె అన్నారు. జీవనం కోసం కూలి పని చేసుకుంటున్న మహిళలు ఎక్కువ మంది ఉన్నారని వీరందరికీ కేరళ తరహాలో రేషన్ దుకాణాలు ద్వారా 16 రకాల నిత్యావసర వస్తువులు అందించాలని ,విద్య , వైద్యం, కేరళ తరహాలోనే భారతదేశంలో ,తెలంగాణలో కూడా, అమలు చేయాలని ఆమె డిమాండ్ చేశారు. కేరళలో మహిళల పక్షపాతిగా పేదల పక్షపాతిగ పినరై పరిపాలన కొనసాగుతుందని ఆ విధానాలు అమలు కోసం ఖమ్మం జిల్లాలో తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర మహాసభల ప్రారంభ సందర్భంగా డిసెంబర్ 29న ఖమ్మం పటేల్ గ్రౌండ్లో జరిగే బహిరంగ సభకు మహిళలు అధిక సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని ఆమె పిలుపునిచ్చారు  ఈ కార్యక్రమంలో సంఘం రాష్ట్ర నాయకురాలు బుగ్గ వీటి సరళ , ఐద్వా జిల్లా కార్యదర్శి మాచర్ల భారతి తదితరులు పాల్గొన్నారు.

Related posts

స్ట్రాంగ్ రూమ్ వద్ద పటిష్ట బందోబస్త్

Satyam NEWS

లింగ వివక్ష త లేని సమాజం నిర్మించడమే లక్ష్యం

Satyam NEWS

సీబీఐ స్పందిచనందునే ఏసీబీ దర్యాప్తు చేయిస్తున్నాం

Satyam NEWS

Leave a Comment