36.2 C
Hyderabad
April 24, 2024 19: 50 PM
Slider కడప

అక్రమ సంభందంతో భర్తపై హత్యాయత్నం

#DSP MD Sharif

ప్రియుడిపై ఉన్న మోజుతో ఏకంగా భర్తనే ప్రియుడితో కలిసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని కనుములోపల్లిలో చోటు చేసుకుంది. ఈ సంఘటనకు సంబందించిన వివరాలను మంగళవారం సిద్దవటం పోలీస్ స్టేషన్లో కడప డిఎస్పీ ఎండి షరీఫ్ వెల్లడించారు.

శ్రీకాళహస్తికి చెందిన అవ్వారు జ్ఞానేశ్వర్ బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఉద్యోగం చేసేవాడు. మూడు నెలల క్రితం కడప హనుమప్ప వీధికి చెందిన నవితతో వివాహం జరిగింది. గత నెల 19 శ్రీకాళహస్తి నుంచి తన భార్యను పిలుచుకుని కడపలోని తన అత్తగారింటిలో దింపి తిరిగి శ్రీకాళహస్తికి వెళ్ళిపోయాడు.

25వ తేదీన అత్తగారింటిలో తన భార్యను పిలుచుకుని వెళ్లేందుకు కడపకు వచ్చి రాత్రి అత్తగారింట్లో బస చేశాడు. మరుసటి రోజు26వ తేదీన ఉదయం తన భార్యను వెంటబెట్టుకుని కడప నుంచి కారులో శ్రీకాళహస్తికి బయలుదేరాడు.

కనుములోపల్లి వద్దకు రాగానే తనకు వాంతి వస్తోందని కారు ఆపాలని భర్తతో చెప్పింది. దీంతో జ్ఞానేశ్వర్ కారును కనుములోపల్లి వద్ద ఆపాడు. ఇంతలో అకస్మాత్తుగా కడపలోని హనుమప్ప వీధికి చెందిన జాహ్వారి కాపిష దుర్గేష్ సింగ్ వచ్చి కారులోకెళ్లి జ్ఞానేశ్వర్ పై కత్తితో దాడి చేసి పరారయ్యాడు. భార్య వనిత తనకేమి తెలియనట్లు భర్తను చికిత్స నిమిత్తం కడప నగరంలోని పల్లా ఆసుపత్రికి తరలించాడు.

ఈ ఘటనపై జ్ఞానేశ్వర్ సిద్దవటం పోలీస్ స్టేషన్లో 27వ తేదీన ఫిర్యాదు చేశాడు. దీనిపై సిద్దవటం ఎస్సై తులసి నాగప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఆధునిక, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా 10 రోజుల్లోనే హత్యాయత్నం కేసును ఛేదించారు. వినీతకు వివాహం జరగక ముందే పక్కింటి వాడైన జే. కే సింగ్ తో అక్రమ సంబందము ఉండేది.

వినీతకు వివాహమైనప్పటికీ భర్తతో అయిష్టంగానే కాపురం కొనసాగించింది. ఏప్రిల్ 26వ తేదీన భర్తను హతమార్చాలని పధకం పన్నింది. కనుములోపల్లి వద్ద కారును ఆపి భర్తపై ప్రియుడి చేత కత్తితో హత్యాయత్నం చేయించింది. ఈ విషయాలన్నీ పోలీసుల దర్యాప్తులో వెలుగులోకి వచ్చాయి.

ఈ ఘటనపై మంగళవారం కడప నగరంలోని వై జంక్షన్ వద్ద ఉన్న వినీత, ప్రియుడు సింగ్ ను డిఎస్పీ వెల్లడించారు. హత్యాయత్నానికి వినియోగించిన మారణాయుధం, చరవాణిలు స్వాధీనం చేసుకున్నామన్నారు. అనతికాలంలోనే కేసును ఛేదించిన సిద్దవటం ఎస్సై తులసి నాగ ప్రసాద్ ను, సిబ్బందిని జిల్లా ఎస్పీ కెకెఎన్ అన్బురాజన్ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఒంటిమిట్ట సీఐ పురుషోత్తం రాజు, ఎస్సై తులసి నాగ ప్రసాద్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Related posts

డబుల్ ధమాకా: వైసిపికి చెంప దెబ్బ టిడిపికి గోడ దెబ్బ

Satyam NEWS

తిరుపతి టీడీపీ టిక్కెట్టుకు భారీ డిమాండ్

Satyam NEWS

ఈ సంవత్సరం కరోనా పూర్తిగా అంతరించిపోవాలి

Satyam NEWS

Leave a Comment