40.2 C
Hyderabad
April 19, 2024 16: 35 PM
Slider కవి ప్రపంచం

మనసు భాష

#Chintapatla Sudarshan

సుఖాన్ని దుఖా:న్ని

ఇష్టాన్ని అయిష్టాన్ని

ప్రేమనీ ఆప్యాయతనీ

చెప్పడానికి మనసుకి

మరో మార్గమేదీ లేదు

మాతృభాష తప్ప.

రాజయినా మంత్రమయినా

ఉన్నత ఉద్యోగి అయినా

అమ్మను అమ్మా అనే పిలవాలి

కమ్మని అమ్మభాషలో

యాభైఆరు అక్షరాలే

లక్షల పదాలుగా ప్రవహిస్తాయి

అనేక జీవితకథల్ని చిత్రిస్తాయి.

మండుటెండలో నాలుకమీద

చల్లటి నీటిచుక్క పడ్డట్టు

నడి సముద్రంలో కొట్టుకుపోతుంటే

నావ ఒకటి ఎదురొచినట్టు

తేనెటీగలు పట్టుమని ‘‘పట్టు’’ని

చేతికి అందించినట్టు

ఎంత హాయిని కలిగిస్తుంది

మనసు భాష

మనదైన తెలుగు భాష

చింతపట్ల సుదర్శన్

Related posts

యాదవుల మీటింగ్ ఎందుకోసం?

Satyam NEWS

భజరంగ్‌ యూత్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో గణనాథుని కి ఘనంగా పూజలు

Satyam NEWS

చిరు వ్యాపారులకు అండగా ఉంటా

Satyam NEWS

Leave a Comment