39.2 C
Hyderabad
March 29, 2024 16: 02 PM
Slider మహబూబ్ నగర్

అంగన్వాడీ బడిలో ఆయుష్మాన్ భారత్

#anganwadi

అంగన్వాడి బడిలో ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులు సద్వినియోగం చేసుకోవాలని అంగన్వాడి టీచర్ పి సునీత పిలుపునిచ్చారు. నాగర్ కర్నూల్ జిల్లా కల్వకుర్తి పట్టణంలోని అంగన్వాడి సెంటర్ గాంధీనగర్ 2  వద్ద శనివారం టీచర్ సునీత ఆధ్వర్యంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులు పేరు నమోదు ప్రక్రియను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ 14వ వార్డు గాంధీనగర్ అంగన్వాడి బడిలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ యోజన హెల్త్ కార్డులు రిజిస్ట్రేషన్ ప్రక్రియను ఏర్పాటు చేశామని పట్టణ ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. హెల్త్ కార్డు నమోదు ప్రక్రియలో తెల్ల రేషన్ కార్డు ఆధార్ కార్డు చరవాణి నెంబర్ కుటుంబ సభ్యుల ఫోటోలు అవసరమని తెలిపారు. హెల్త్ కార్డు ద్వారా సంవత్సరానికి ఒక కుటుంబానికి 5 లక్షల చొప్పున ప్రథమ చికిత్స కోసం ప్రభుత్వ ప్రైవేటు ఆసుపత్రులలో నగదు రహిత చికిత్స అందిస్తారని తెలిపారు.ఈ పథకం తెల్ల రేషన్ కార్డ్ ఉన్న ప్రతి ఒక్కరు అర్హులేనని అన్నారు. ఈ పథకాన్ని లబ్ధిదారులందరూ నమోదు చేసుకోవాలని సూచించారు.

Related posts

స్వాతంత్ర్య దినోత్సవం సందర్బంగా టీఎస్ఆర్టీసీ ప్రత్యేక రాయితీ

Satyam NEWS

పేపర్ లీకేజీపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాల్సిందే

Satyam NEWS

కామెడీ పండించాడు కంటతడి పెట్టించాడు

Satyam NEWS

Leave a Comment