33.2 C
Hyderabad
April 26, 2024 02: 50 AM
Slider ప్రపంచం

ఆస్ట్రేలియా అభ్యర్థన:మా ఎలుకలను చంపడానికి రండి

australia requested india kill rats

మా వళ్ళ కావడం లేదు మా దేశం లో ఎలుకలను చంపడానికి సాయం చేయండి మహా ప్రభో అని భారత్ ను ఆస్ట్రేలియా సాయం కోరుతుంది. ఒక పక్క కరోనాతో సతమతమవుతుంటే మరో పక్క ఎలుకల సమస్య వాటి ద్వారా ప్లేగు వ్యాధి ప్రబలే అవకాశాలుండటం తో ఆస్ట్రేలియా ప్రజలు వణికి పోతున్నారు.ప్రస్తుతం ఆస్ట్రేలియా లో ఎలుకలు పెద్ద గుంపుగా ఏర్పడి పంట పొలాలపై దాడి చేస్తు పొలాలను సర్వనాశనం చేస్తున్నాయి. న్యూ సౌత్‌వేల్స్‌ రాష్ట్రంలో గత కొన్ని రోజులుగా ఎలుకలు బీభత్సం సృష్టిస్తున్నాయి. భారీగా పెరిగిపోయిన వీటి సంతతి అక్కడి ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయి.పంట పొలాలను నాశనం చేయడమేగాక ఇళ్లు, రెస్టారెంట్లు, హోటళ్లు ఇలా ఎక్కడ చూసిన ఎలుకలే దర్శనమిస్తుండడంతో ఏం చేయాలేక అధికారులు తలలు పట్టుకుంటున్నారు. ఇది ఇలాగే కొనసాగితే ప్లేగు వ్యాది ప్రబలే అవకాశం కూడా ఉంది.ఈ నేపథ్యంలో ఎలుకల సమస్యను అధిగమించేందుకు ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ను సాయం కోరింది. భారత్‌లో ఎలుకల నివారణకు బ్రోమాడియోలోన్‌ అనే విషపదార్థాన్ని వాడేవారు. ప్రస్తుతం ఈ మందు భారత్‌లో నిషేధంలో ఉంది.తాజాగా ఆస్ట్రేలియా ప్రభుత్వం భారత్‌ నుంచి దాదాపు 5వేల లీటర్ల బ్రోమాడియోలోన్‌ కొనుగోలు చేయడానికి ప్రయత్నిస్తుంది. అందుకు సంబంధించి ఇప్పటికే భారత అధికారులతో చర్చలు జరుపుతున్నారు. కాగా న్యూ సౌత్‌వేల్స్‌ ప్రభుత్వం ఎలుకలను నివారించేందుకు రూ. 3,600 కోట్లు నిధులను ప్రత్యేకంగా కేటాయించింది. భారత్‌ నుంచి బ్రోమాడియోలోన్‌ మందు రాగానే ఆస్ట్రేలియా ప్రభుత్వం అనుమతితో ఎలుకలను చంపేందుకు కార్యచరణ మొదలుపెట్టనున్నారు.

Related posts

33 రోజులైంది… ముఖ్యమంత్రి గారూ జోక్యం చేసుకోండి…

Satyam NEWS

రష్యాపై పిడుగు: వీసా మాస్టర్ కార్డు కార్యకలాపాల ఉపసంహరణ

Satyam NEWS

నరసరావుపేట లో మాజీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర పర్యటన

Satyam NEWS

Leave a Comment