27.7 C
Hyderabad
April 19, 2024 23: 25 PM
Slider ప్రపంచం

ఉక్రెయిన్ యుద్ధంపై భారత్ మౌనాన్ని అర్ధం చేసుకున్నాం

#austelienprimeminister

ఉక్రెయిన్‌, రష్యా  యుద్ధంపై భారత్ అనుసరిస్తున్న వైఖరిని తాను పూర్తిగా అర్థం చేసుకున్నానని ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ స్పష్టం చేశారు. ప్రధాని నరేంద్ర మోదీతో స్కాట్ వర్చువల్ సమావేశంలో మాట్లాడుతూ భారత్ ఆస్ట్రేలియా మధ్య మైత్రీ బంధం వంటి కీలక అంశాల నేపథ్యంలో ఉక్రెయిన్ రష్యా యుద్ధంపై ఆస్ట్రేలియా ప్రధాని స్పందించారు.

ఇండో పసిఫిక్ ప్రాంతంలో ఇటువంటి భయానక పరిస్థితి ఇకపై తలెత్తకుండా అన్ని చర్యలూ తీసుకోవల్సి ఉందని ఆస్ట్రేలియా నేత తెలిపారు. రష్యా ఇప్పుడు ఉక్రెయిన్‌పై సాగిస్తోన్న దాడిలో వేలాది మంది పౌరులు మృతి చెందుతున్నారుని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఉక్రెయిన్ సంక్షోభంపై ఇటీవలి క్వాడ్ దేశాల భేటీలో చర్చ జరిగిందని మోరిసన్ గుర్తు చేశారు.

ఇండో పసిఫిక్ ప్రాంతపు పరిణామం నేపథ్యంలో యూరప్‌లో తలెత్తిన పరిస్థితులను ఈ క్వాడ్ భేటీలో చర్చించేందుకు వీలేర్పడినట్లు తెలిపారు. ఇండో-ఫసిఫిక్‌ ప్రాంతానికి భావ సారూప్యత కలిగిన ఉదారవాద ప్రజాస్వామ్య దేశాల మధ్య సహకారం కీలకమని మారిసన్‌ వ్యాఖ్యానించారు. ఇటువంటి కీలకమైన అంశాలపై దృష్టి పెట్టడానికి క్వాడ్‌లో భారత్‌ నాయకత్వాన్ని మారిసన్‌ స్వాగతించారు.

ఉక్రెయిన్ రష్యా యుద్ధం గురించి ప్రధాన మంత్రి మోదీ ఈ భేటీలో  ప్రస్తావించలేదు. ప్రధాని మోదీ  తమ ప్రసంగంలో ప్రత్యేకించి భారత్ ఆస్ట్రేలియా మధ్య సంబంధాల గురించి మాత్రమే ప్రస్తావించారు. భారతదేశపు విదేశాంగ విధానాన్ని ఆస్ట్రేలియా ప్రధాని ప్రస్తావిస్తూ కీలక అంశాలపై అంతర్జాతీయ స్థాయిలో నరేంద్ర మోదీ  అనేక సార్లు చొరవ తీసుకుని సవ్యంగా వ్యవహరించిందని కొనియాడారు. ఉక్రెయిన్ పై భారత్ వైఖరిని కూడా అర్ధం చేసుకున్నామని స్కాట్ వ్యాఖ్యానించారు.

Related posts

రాజకీయ పార్టీలను చేర్చుకుంటే మీ ప్రయోజనాలకే దెబ్బ

Satyam NEWS

బిచ్చుంద మండలంలో రంజాన్ కానుకలు పంపిణీ

Satyam NEWS

పీవీ సింధు ను సత్కరించిన అదిలాబాద్ ఎంపీ

Satyam NEWS

Leave a Comment