37.2 C
Hyderabad
April 19, 2024 13: 33 PM
Slider తెలంగాణ

ఆస్ట్రేలియా కార్చిచ్చుపై ఎంపీ సంతోష్‌ కుమార్‌ ట్వీట్

santosh astrelia

ఆస్ట్రేలియాలోని అడవుల్లో కొన్ని నెలలుగా కార్చిచ్చు రగులుతోన్న విషయం తెలిసిందే. ఆ మంటలను ఆర్పేందుకు చేస్తోన్న ప్రయత్నాలు ఫలించట్లేదు. అడవుల్లో విస్తరిస్తున్న దావానలం పట్ల ప్రపంచ వ్యాప్తంగా పలువురు నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

ఇప్పటికే అగ్నికీలల ధాటికి వేలాది మంది నిరాశ్రయులయ్యారు. మిలియన్ల సంఖ్యలో జంతువులు చనిపోయాయి. దీనిపై టీఆర్‌ఎస్‌ ఎంపీ సంతోష్‌ కుమార్‌ స్పందిస్తూ ట్వీట్ చేశారు. అగ్నికీలలు ఎగిసిపడుతోన్న కారణంగా ఆస్ట్రేలియా మొత్తం ప్రమాదాన్ని ఎదుర్కుంటోందని ఆయన అన్నారు.

మంటల్లో లక్షలాది మూగజీవాలు ప్రాణాలు కోల్పోవడం బాధకలిగిస్తుందని పేర్కొన్నారు. త్వరలోనే ఆస్ట్రేలియా ఆడవుల్లో మంటలు అదుపులోకి రావాలని ప్రార్థిద్దామని సంతోష్ కుమార్ ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో ఆస్ట్రేలియా శ్రేయస్సు కోసం కూడా భగవంతుడిని ప్రార్థిద్దామన్నారు.

Related posts

వలంటీర్ల సేవలకు బహుమతి ప్రదానోత్సవ సభలో నాసిరకం స్నాక్స్

Satyam NEWS

రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ చిత్రపటానికి పాలాభిషేకం

Satyam NEWS

న్యూ డైరెక్షన్: ఉద్యోగం అడగవద్దు ఇచ్చే స్థాయికి రండి

Satyam NEWS

Leave a Comment