35.2 C
Hyderabad
April 24, 2024 14: 54 PM
Slider ప్రపంచం

చైనాతో లింకులు ఉన్న ప్రతిపక్ష నేత ఇళ్లపై పోలీసు దాడులు

#Shaquett Moselmane

తమ అంతర్గత అంశాలలో జోక్యం కేసుకుంటున్న చైనాకు ఆస్ట్రేలియా గట్టి వార్నింగ్ ఇచ్చింది. చైనా తమ అంతర్గత వ్యవహారాలలో జోక్యం చేసుకునే విధంగా సహకరిస్తున్న ప్రతిపక్ష లేబర్ పార్టీ నాయకుడు షౌకత్ మోసిల్మానే ఇళ్లపై నేడు ఆస్ట్రేలియాకు చెందిన అధికారుల బృందం దాడులు చేసి పెద్ద ఎత్తున తనిఖీలు నిర్వహించింది.

కరోనా వైరస్ నేపథ్యంలో చైనాపై ఆస్ట్రేలియా తీవ్ర విమర్శలు చేసింది. తమ పై చేసిన విమర్శలకు సమాధానంగా ఆస్ట్రేలియాపై ఆర్ధిక ఆంక్షలను చైనా విధించింది. ఈ నేపథ్యంలో తమ దేశంలోనే చైనాకు మద్దతు తెలుపుతున్న వారు ఉన్నట్లు ఆస్ట్రేలియా ప్రభుత్వం నిఘా పెట్టింది.

ప్రతిపక్ష లేబర్ పార్టీకి చెందిన షౌకత్ మోసిల్మానే ఈ కార్యక్రమాలకు మద్దతు పలుకుతున్నట్లు అనుమానిస్తూ కేసులు నమోదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించేందుకు ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోర్రిసన్ నిరాకరించారు. చట్టం తన పని తాను చేసుకువెళుతుందని ఆయన అన్నారు. ప్రభుత్వ వ్యవహారాలలో గానీ ఆస్ట్రేలియా భద్రతా వ్యవహారాలలో గానీ వేరే దేశం వారు జోక్యం చేసుకోవడాన్ని తాము ఎట్టిపరిస్థితుల్లో సహించేది లేదని స్కాట్ చెప్పారు.

సిడ్నీలోని అతని ఇంటిపై దాడులు నిర్వహించినట్లు ఆస్ట్రేలియన్ సెక్యూరిటీ ఇంటెలిజెన్స్ ఆర్గనైజేషన్, ఆస్ట్రేలియన్ ఫెడరల్ పోలీసు ధృవీకరించారు. ఇలాంటి ఆరోపణలు రావడం, పోలీసులు దాడులు చేయడం కొత్త కాదని చాలా కాలంగా ఇలా జరుగుతున్నా ఆధారాలు లభించడం లేదని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ వ్యాఖ్యానించింది. ఏదో భయంతోనే ఆస్ట్రేలియా ఈ విధంగా వ్యవహరిస్తున్నదని చైనా ఇప్పటికే వ్యాఖ్యానించింది. 2017 లో కూడా ఇదే విధంగా చైనా తో వ్యాపార సంబంధాలు ఉన్న ఒక ఆస్ట్రేలియన్ సెనేటర్ ను బలవంతంగా రాజీనామా చేయించారు.

Related posts

మాజీ మంత్రి నాయినిని పరామర్శించిన మంత్రి ఈటెల

Satyam NEWS

ప్రొటెస్టు: వైసీపీ ఎన్నికల అరాచకాలపై అఖిలపక్షం ధర్నా

Satyam NEWS

రోగులకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా వైద్య సేవలు అందించాలి

Satyam NEWS

Leave a Comment