36.2 C
Hyderabad
April 25, 2024 22: 07 PM
Slider కరీంనగర్

అధికారులు మానవతా దృక్పథంతో సుపరిపాలన అందించాలి

#Minister Gangula Kamalakar

కరీంనగర్ జిల్లా అంటేనే ఉద్యమాల ఖిల్లా, ముఖ్యమంత్రి కెసిఆర్ కి ఇష్టమైన జిల్లా అని, ఇక్కడ పని చేసి వెళ్లిన అధికారులు నేడు ఉన్నత స్థానాల్లో ఉన్నారని తెలంగాణ రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌర సరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ అన్నారు. రాచకొండ కమిషనరేట్ జాయింట్ కమిషనర్ గా బదిలీపై వెళుతున్న వి సత్యనారాయణకి వీడ్కోలు, కరీంనగర్ నూతన సిపిగా బాధ్యతలు చేపట్టిన ఎల్ సుబ్బారాయుడుకి స్వాగతం పలుకుతూ శుక్రవారం పోలీస్ హెడ్ క్వార్టర్స్ లోని ఏర్పాటు చేసిన ఆత్మీయ సమ్మేళనం కార్యక్రమానికి మంత్రి గంగుల కమలాకర్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ అధికారులు మానవతా దృక్పథంతో పని చేసి సుపరిపాలన అందించాలనీ,ప్రజల మన్ననలు పొందడమే లక్ష్యంగా పని చేయాలనీ సూచించారు.

చరిత్ర కలిగిన కరీంనగర్ జిల్లా ఖ్యాతిని పెంచేలా అధికారులు కలిసికట్టుగా పని చేయాలనీ, ఏ అధికారి అయినా ప్రజల మన్ననలు పొందాలి..అదే లక్ష్యంగా అందరూ పని చేయాలనీ అన్నారు. బదిలీపై వెళ్లిన వారికి గౌరవంగా వీడ్కోలు పలకడం కొత్తగా వచ్చిన వారికి స్వాగతం పలకడం మంచి సంప్రదాయం అని అన్నారు. సీపీ గా అన్ని వర్గాల మన్ననలు పొందిన కొద్ది మందిలో సత్యనారాయణ ఒకరు అని కొనియాడారు. నూతనంగా వచ్చిన సీపీ సుబ్బారాయుడు నేను ఎమ్మెల్యేగా ఉన్నపుడే osd గా సుపరిచితుడనీ కరీంనగర్ కు స్వాగతం పలుకుతున్న అని అన్నారు.

ప్రధాని పీవీ పుట్టిన జిల్లా..సింహ గర్జన చేసిన జిల్లా కరీంనగర్ అని.. మన జిల్లా అంటే ఎంతో మందికి గౌరవం అని అన్నారు. కరీంనగర్ లో పని చేసిన అనుభవం ఉన్న అధికారులు అంటే క్వాలిటీ గా పని చేస్తారనే పేరు ఉందని…ఇక్కడ పని చేసిన ప్రతీ ఒక్కరూ ఒక బ్రాండ్ గా వెళ్తారు అని అన్నారు. పదవులు అజమాయిషీ, ఆధిపత్యం చేయడానికి కాదని సేవ చేయడమనే అని అన్నారు. ప్రతీ అధికారి మానవత దృక్పథంతో పని చేసి సుపరిపాలన అందించి..ప్రజల మన్ననలు పొందాలనీ అన్నారు. పోలీస్, ప్రభుత్వం, మీడియా, అధికారులు నలుగురు కలిసే ప్రజలకు సేవ చేస్తాం అని… అంతిమంగా ప్రజలకు సేవ చేయడమే లక్ష్యంగా పని చేసి..

అన్ని రంగాలు కలిసి జిల్లా ఖ్యాతి మరించ పెంచాలని అన్నారు. సామాన్య మానవునికి న్యాయం జరగాలనీ..న్యాయం జరగక పోయినా అన్యాయం జరగకుండా చూసుకోవాలనీ అన్నారు. మొదటి సారి కరోనా కేసులు కరీంనగర్ లో నమోదు కావడంతో దేశం అంత కరీంనగర్ వైపు చూశారనీ..ఆ రోజు ఎవరము భయపడకుండ ప్రజల్లోకి వెళ్ళామని..ఆ రోజు పోలీసుల సహకారం..మరువలేనిదనీ..పోలీసుల సహకారంతోనే అందరిలో ఆనాడు ధైర్యాన్ని నింపగలిగామని అన్నారు.

Related posts

ఒంటిమిట్ట సీతారాములకు తిరుమల శ్రీవారి కానుక

Satyam NEWS

భార్య పుట్టింటికి వెళ్లిందని భర్త ఆత్మహత్య

Bhavani

కొత్త ఓట్లపై పిటీషన్లు కొట్టేసిన ఆంధ్రప్రదేశ్ హైకోర్టు

Satyam NEWS

Leave a Comment