20.7 C
Hyderabad
February 5, 2023 03: 56 AM
Slider ఆదిలాబాద్

సొంత సొమ్ముతో ఆటో డ్రైవర్లకు వాహన బీమా చెల్లించిన బీజేపీ నేత

#nirmalbjp

జీవన ఉపాధి కోసం పగలు రాత్రి అనే తేడా లేకుండా కష్టపడుతున్న ఆటో డ్రైవర్లకు సాయం చేసేందుకు తన వంతు సాయంగా వాహన బీమా ప్రీమియం ను బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు చిట్యాల సుహాసిని రెడ్డి సొంత సొమ్ముతో చెల్లించారు. కేంద్ర ప్రభుత్వం పోస్టల్ డిపార్ట్ మెంట్ ద్వారా చేపట్టిన భీమా పథకం అందరికీ అందాలన్న ఉద్దేశం తో తన వంతుగా లైట్ మోటార్ వెహికల్స్ అలాగే ఆటో డ్రైవర్స్ కి  భీమా డబ్బులు చెల్లించినట్లు సుహాసిని రెడ్డి తెలిపారు.

తెలంగాణ ట్రాఫిక్ పోలీస్  ప్రతి రోజు టార్గెట్ చొప్పున విచ్చలవిడి గా ఎక్కడ పడితే అక్కడ జరిమానాలు విధిస్తున్నారని ఆమె అన్నారు. వాహనదారుల ఫోటోలు తీస్తూ ప్రతిరోజు పోలీసులు టార్గెట్స్ పూర్తి చేసేందుకు తెలంగాణ ప్రజలను ఇబ్బంది పెడుతున్నారని ఆమె అన్నారు. ఇతర రాష్ట్రాల తో పోలిస్తే మన రాష్ట్రం లోనే ట్రాఫిక్ చలాన్ విపరీతం ఉందని ఆమె అన్నారు. ఎక్కడపడితే అక్కడ స్పీడ్ లిమిట్ బోర్డును ఏర్పాటు చేయకుండానే చలాన్ వేస్తున్నారని తెలియజేశారు.

వాహన దారులు సంపాదించే ప్రతి రూపాయి చలాన్ కోసమే అన్నట్లు ఉందని ఆమె అన్నారు. వాహనదారులకు కేంద్ర ప్రభుత్వం నుంచి అందిస్తున్న పోస్టల్ భీమా పథకం గురించి తెలియజేస్తూ, ఈ పథకం లైట్ మోటార్ వెహికల్ డ్రైవర్స్ కి, ఆటో డ్రైవర్స్ అందాలన్న ఉద్దేశం తో తాను స్వంత డబ్బులతో చేయిస్తానని చెప్పారు. దీనికోసం తన కార్యాలయం లో ప్రత్యేక కౌంటర్ ఏర్పాటు చేశామని, డిసెంబర్ ఏడవ తారీకు లోపు ప్రతి ఒక్కరూ చేయించుకోవాలని అన్నారు. అనంతరం నూతనంగా ఎన్నికైన సిద్ది వినాయక లైట్ మోటార్ వెహికల్ ఒనర్స్ అండ్ డ్రైవర్స్ అసోసియేషన్ సభ్యులను సన్మానించారు.

Related posts

ఘనంగా జాతీయ సమైక్యత వజ్రోత్సవ వేడుకలు

Satyam NEWS

త్వరలో కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు శుభవార్త

Satyam NEWS

స్పెషల్: కొల్లాపూర్ లో ప్రయివేటు దోవ పట్టిన పట్టణ ప్రగతి

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!