35.2 C
Hyderabad
April 20, 2024 16: 21 PM
Slider సినిమా

డికేడ్ అగ్రికల్చర్ అవార్డ్స్ గెలుచుకున్న న్యూ హాలండ్

new hollend

సిఎన్ హెచ్ ఇండస్ట్రియల్ బ్రాండ్ అయిన న్యూ హాలండ్ బ్రాండ్ ఆఫ్ ది డికేడ్ అవార్డ్ 2020 ను గెలుచుకుంది. బ్రాండ్ లాక్ ఈక్విటీ, ఆవిష్కరణలు, కస్టమర్ లాయల్టీని సాధించడంలో విజయవంతం అయినందుకు ఈ అవార్డు గెలుచుకుంది. హెరాల్డ్ గ్లోబల్ నెలకొల్పిన ఈ అవార్డు ప్రతిష్టాత్మక సంస్థలకు అందిస్తుంది.

న్యూ హాలండ్ అగ్రికల్చర్‌ హాస్ స్థిరమైన వ్యవసాయాన్ని చేస్తూ పలు సమస్యలకు పరిష్కారాలను అందించింది. వ్యాపార విస్తరణ పరంగానే కాకుండా, మాన్యువల్ నుండి యాంత్రిక వ్యవసాయానికి రైతులకు సహాయపడటంలో చురుకైన పాత్ర పోషించింది.

ఈ అవార్డును స్వీకరించడానికి న్యూ హాలండ్ నుండి అధికారులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. హెరాల్డ్ గ్లోబల్ ఎడిటర్-ఇన్-చీఫ్ మిస్టర్ సైమిక్ సేన్ అవార్డును వారికి అందజేశారు. ఈ సందర్భంగా సిఎన్హెచ్ ఇండస్ట్రియల్ చీఫ్ మార్కెటింగ్ ఆఫీసర్ తరుణ్ ఖన్నా మాట్లాడుతూ ఈ ప్రతిష్టాత్మక అవార్డును గెలుచుకున్నందుకు న్యూ హాలండ్‌లో ప్రతి ఒక్కరికీ ఎంతో ఆనందంగా ఉందని అన్నారు. న్యూ హాలండ్‌లోని ప్రతి ఉద్యోగి చూపిన కృషి, అంకితభావం, నిజాయితీ కి ఇది ఫలితం అని అన్నారు.

Related posts

చంద్రబాబు అక్రమ అరెస్టుకు నిరసనగా కొవ్వొత్తుల ర్యాలీ

Satyam NEWS

అమరుల స్ఫూర్తితో గీత కార్మికుల హక్కుల కోసం ఉద్యమిస్తాం

Satyam NEWS

పాజిటీవ్ కేసులు పెరిగినా ప్రజలు భయపడవద్దు

Satyam NEWS

Leave a Comment