మధురైలో జనవరి 31, ఫిబ్రవరి 1, 2 తేదీలలో జరిగిన జాతీయ స్కేటింగ్ పోటీలలో అన్నమయ్య జిల్లా రాజంపేటకు చెందిన ఇద్దరు విద్యార్థులు గోల్డ్ మెడల్ సాధించారు. మేడూరి లక్ష్మీ స్నేహిత అండర్- 4 క్వాడ్ రిలే రేస్ 200 మీటర్ల లో గోల్డ్ మెడల్ సాధించారు. శౌర్య సింహ వర్మ అండర్- 6 క్వాడ్ రిలే రేస్ 200 మీటర్ల లో గోల్డ్ మెడల్ సాధించారని కోచ్ వినోద్ కుమార్ తెలిపారు. వీరు రాజంపేటలోని వికే స్కేటింగ్ అకాడమీలో ఆరు నెలల నుంచి శిక్షణ పొందుతున్నారు. గత నెలలో తిరుపతిలో జరిగిన స్కేటింగ్ పోటీలలో వీరు గోల్డ్ మెడల్ సాధించి, జాతీయ స్థాయికి ఎంపికయ్యారు అని కోచ్ తెలిపారు.
previous post