40.2 C
Hyderabad
April 19, 2024 18: 02 PM
Slider విజయనగరం

మరో ఐదు సంస్థలకు ‘మానవత్వ ధీర’ అవార్డుల బహుకరణ..!

#Vijayanagaram Police

గడచిన మూడు నెలలుగా విజయనగరం జిల్లాలో కరోనా కేసులు నమోదు అవడం ఆ వైరస్ సొకి పలువురు వారి కుటుంబాలకు దూరం అవడం జరిగింది. అయితే ఇక్కడ చెప్పుకోదగిన విషయం ఏమిటంటే.. రాష్ట్ర వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి.

కరోనా తో మృతి చెందిన వారికి దగ్గరుండి పలు స్వచ్ఛంద సంస్థలు దహన సంస్కారాలు నిర్వహించాయి. అలాంటి సేవలు చేసిన సంస్థల ను గుర్తించడంతో పాటు.. సన్మానించడం కూడా జరిగింది. తాజాగా మరో ఐదు స్వచ్ఛంద సంస్థలను జిల్లా ఎస్పీ రాజకుమారి.. ప్రత్యేకించి డీపీఓకు పిలిచి మరీ సత్కరించారు. ఇటీవల రాష్ట్ర డిజిపి గౌతమ్ సవాంగ్, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల ఎస్పీలతో జూమ్ కాన్ఫరెన్సు నిర్వహించి, కోవిడ్ 19 విపత్కర పరిస్థితుల్లో సేవలందించిన స్వచ్ఛంద సంస్థల సేవలను కొనియాడారు.

ఇందులో భాగంగా రాష్ట్ర డిజిపి కార్యాలయం నుండి వచ్చిన “మానవత్వ ధీర” అవార్డులను జిల్లాలో కోవిడ్ తో మృతి చెందిన వారికి అంతిమ సంస్కారాలు నిర్వహించిన విజయనగరం పట్టణానికి చెందిన “స్పార్క్ సోసైటీ”, “గౌరీ సేవా సంఘం”, “హిందూ ధర్మరక్ష సమితి”, సాలూరు పట్టణానికి చెందిన “ఫర్ ది ఫ్యూపుల్” “హిందూ ధర్మసేన” మరియు గుమ్మలక్ష్మీపురంకు చెందిన “హెల్పింగ్ హ్యాండ్స్” స్వచ్చంద సంస్థల బృందాలను జిల్లా ఎస్పీ బి. రాజకుమారిఅభినందించి, సాలువలతో సత్కరించి, “మానవత్వ ధీర” అవార్డును ప్రదానం జేసారు.

ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ  రాజకుమారి మాట్లాడుతూ గత సంవత్సరం కోవిడ్ విలయతాండవం చేయడంతో ప్రజలందరూ ఆరోగ్యపరంగా అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నారన్నారు.

ఈ విపత్కర పరిస్థితుల్లో వ్యాధి ఒకరి నుండి ఒకరికి వ్యాపిస్తుంది అన్న భయంతో ఒకరితో ఒకరు కలవలేని, సహాయపడలేని పరిస్థితులు ఎదుర్కొన్నాము. అటువంటి పరిస్థితుల్లో మన జిల్లాకు చెందిన కొన్ని స్వచ్ఛంద సంస్థలు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి, స్వచ్ఛందంగా తమ డబ్బులను ఖర్చు చేస్తూ, అనేక సేవా కార్యక్రమాలను చేపట్టడం అభినందనీయమన్నారు.

కరోనాతో మృతి చెందిన వారికి అంత్యక్రియలు నిర్వహించేందుకు ముందుకు వచ్చి, ప్రజల మన్ననలను పొందుతున్నారన్నారు. కోవిడ్ కష్టకాలంలో స్వచ్ఛంద సంస్థలు ఎంతో ధైర్యంతో ముందుకు వచ్చి కోవిడ్ మృతులు, అనాధ మృతదేహాలకు సంప్రదాయాల ప్రకారం అంతిమ సంస్కారాలు నిర్వహించి, ఎనలేని సేవలందించారన్నారు. అటువంటి వారిని సత్కరించడం బాధ్యతగా

భావించి రాష్ట్ర డీజీపీ ఆదేశాల మేరకు  స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులను  “మానవత్వ ధీర” అవార్డు అందజేసామన్నారు. భవిష్యత్తులో ఈ స్వచ్ఛంద సంస్థలు మరిన్ని సేవా కార్యక్రమాలు నిర్వహించి, సేవా రంగంలో ఉన్నత స్థానంకు చేరుకోవాలని జిల్లా ఎస్పీ రాజకుమారి ఆకాంక్షించారు.

ఈ కార్యక్రమంలో ఒఎస్ డి ఎన్. సూర్యచంద్రరరావు, విజయనగరం డిఎస్పీ పి.అనిల్ కుమార్, ఎఆర్ డిఎస్పీ ఎల్. శేషాద్రి, డిసిఆర్ బి సిఐ బి.వెంకటరావు, ఎస్బీ సిఐలు జి.రాంబాబు, రుద్రశేఖర్, ఎస్ఐ లు అశోక్ కుమార్, ప్రసాదరావు, పాపారావు, హరిబాబు నాయుడు, “స్పార్క్ సొసైటీ”, “గౌరీ సేవా సంఘం”, “హిందూ ధర్మరక్ష సమితి”, సాలూరు కి చెందిన “ఫర్ ది ఫ్యూపుల్” “హిందూ ధర్మసేన” గుమ్మలక్ష్మీపురంకు చెందిన “హెల్పింగ్ హ్యాండ్స్” స్వచ్చంద సంస్థల ప్రతినిధులు, ఇతర పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

Related posts

టి ఎస్ ఆర్ టి సి బిల్లుకు గవర్నర్ ఆమోదం

Bhavani

ఇందిరాగాంధీకి ప్రధాని మోదీ, అమిత్ షా నివాళులు

Satyam NEWS

సంచలనమైన తీర్పు ఇచ్చిన విజయనగరం జిల్లా జడ్జి

Satyam NEWS

Leave a Comment