39.2 C
Hyderabad
March 29, 2024 16: 43 PM
Slider విజయనగరం

ప్రతిభ కనబర్చిన విజయనగరం పోలీసులకు ప్రశంసా పత్రాలు

#depikaips

విజయనగరం జిల్లా పోలీసుశాఖలో విధులను సమర్ధవంతంగా నిర్వహించి, దొంగతనం కేసులను ఛేదించిన అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఎం. దీపిక నేర సమీక్షా సమావేశంలో అభినందించి, జ్ఞాపిక లను, ప్రశంసా పత్రాలను అందజేసారు.

విజయనగరం వన్ టౌన్, 2 టౌన్ పోలీసు స్టేషన్ల పరిధిలో నమోదైన చైన్ స్నాచింగ్ కేసుల్లో ముద్దాయిని అరెస్టు చేసి చోరీ సొత్తును స్వాధీనం చేసుకోవడంలో ప్రతిభ కనబర్చిన విజయ నగరం టూటౌన్ కానిస్టేబులు ఎం.వాసు, ఆండ్ర పోలీసు స్టేషను పరిధిలో గంజాయి అక్రమ రవాణాను అరికట్టుటలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి, భారీగా గంజాయి స్వాధీనం చేసుకొని, నిందితులను అరెస్టు చేయుటలో ప్రతిభ కనబర్చిన కానిస్టేబులు ఎం. అప్పన్నలను “బెస్ ఫెర్మార్స్”గా ఎంపిక చేసి, వారిని అభినందించి, ప్రత్యేకంగా రూపొందించిన జ్ఞాపికలను జిల్లా ఎస్పీ ఎం. దీపిక బహూకరించారు.

అదే విధంగా వివిధ దొంగతనం కేసుల్లో ప్రతిభ కనబర్చిన (1) 2వ పట్టణ సిఐ సిహెచ్. లక్ష్మణరావు (2) సిసిఎస్ సిఐ సిహెచ్. శ్రీనివాసరావు (3) బొబ్బిలి ఎస్ఐ సిహెచ్. సూర్య నారాయణ (4) సిసిఎస్ ఎఎస్ఐ ఎ. గౌరీ శంకర్ (5) గంట్యాడ హెచ్ సి ఎం. రామకృష్ణ (6) సిసిఎస్ కానిస్టేబులు పి.శ్రీనివాస్ లను, రోడ్డు ప్రమాదాల్లో క్షతగాత్రులను సకాలంలో ఆనుపత్రికి తరలించి, వారి ప్రాణాలు కాపాడిన (7) ట్రాఫిక్ కానిస్టేబు ఎస్. సింహాచలంను, మానభంగం కేసులో పరారీలో ఉన్న నిందితుడి ఆచూకీ కనుగొని, అతనిని అరెస్టు చేయుటలో సహకరించిన (8) పార్వతీపురం పట్టణ ఎఎస్ఐ ఎల్. శ్రీనివాసరావు (9) కానిస్టేబులు పి. ఉదయ భాస్కరరావులను జిల్లా ఎస్పీ ఎం. దీపిక అభినందించి, ప్రశంసా పత్రాలను, ప్రోత్సాహక నగదు బహుమతులను అందజేసారు.

పోలీసు వాహనాల తనిఖీలు

జిల్లా పోలీసుశాఖలో ఉన్న పోలీసు వాహనాలను అదనపు ఎస్పీ పి. సత్యన్నారాయణరావు ప్రత్యేకంగా తనిఖీ చేసి, వాహనాల పని తీరు, రికార్డును పరిశీలించారు. ఎంటిఓ పి.నాగేశ్వరరావు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీలను పరిశీలించి, సంతృప్తికరంగా వాహనాలను మెయిన్‌టెయిన్ చేస్తున్న పోలీసు డ్రైవర్లును అభినందించారు.ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ పి.సత్యన్నారాయణరావు, ఒఎస్టీ ఎన్.సూర్యచంద్రరావు, డిఎస్పీలు ఇతర పోలీసు అధికారులు, పాల్గొన్నారు.

Related posts

నడక నడక నడక …

Satyam NEWS

కరోనా చికిత్సలలో ప్రభుత్వ నిబంధనలు విధిగా అమలు చేయాలి

Satyam NEWS

ఏకగ్రీవాలను ఆమోదించాలని హైకోర్టు ఆదేశం

Satyam NEWS

Leave a Comment