34.2 C
Hyderabad
April 19, 2024 19: 46 PM
Slider మహబూబ్ నగర్

కరోనా ఎలర్ట్: గ్రామాలలో కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు

rambabu zptc

కరోనా వైరస్‌ వ్యాప్తిని నియంత్రించే చర్యల్లో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు లాక్‌డౌన్‌ ప్రకటించిన నేపథ్యంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఆదేశాలనుసారం నాగర్ కర్నూల్ జిల్లా పదర మండలంలోని గ్రామాలలో లాక్ డౌన్ ను అధికారులు, నాయకులు పర్యవేక్షించారు.

జ్యోతి నాయక్ తండ, చెన్నంపల్లి, చింతల్ కుంట, మారేడుకు తదితర ప్రాంతాలను జడ్పిటిసి రాంబాబు నాయక్, ఎమ్మార్వో కృష్ణయ్య, ఎంపీడీవో వెంకటయ్య, డాక్టర్ గౌతమ్, ఎస్ఐ సురేష్, తెరాస మండల పార్టీ అధ్యక్షుడు వెంకటయ్య, సింగిల్విండో డైరెక్టర్ రమేష్ నేడు సందర్శించారు.

ఆ గ్రామ పంచాయతీలకు సంబంధించిన సర్పంచులు, పంచాయితీ సెక్రెటరీ లు, విఆర్ఓ లు, అంగన్వాడీ టీచర్లు ఆశావర్కర్లు లు తదితరులతో ఎక్కడికక్కడ సమావేశమయ్యారు. ఈ సందర్బంగా జడ్పిటిసి రాంబాబు నాయక్ మాట్లాడుతూ కరోనా వైరస్‌ మహమ్మారిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని చెప్పారు.

ప్రతి ఒక్కరూ నిర్లక్ష్యాన్ని వీడి స్వీయ నియంత్రణ పాటించాలని కోరారు. ద్విచక్ర వాహనాలు, కార్లు రోడ్లపైకి వస్తే తగిన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. అత్యవసరమైతే తప్ప బయటకు రాకూడదని హితవు పలికారు.

నిత్యావసరాల కోసం కుటుంబం లో ఒక్కరు మాత్రమే బయటకు వచ్చి త్వరగా ఇళ్లకు చేరుకోవాలన్నారు. ఎక్కువగా తండాల ప్రజలు బతుకుదెరువు కోసం ఇతర గ్రామాలకు, రాష్ట్రాలకు వెళ్తూ ఉంటారని,  వారంతా సొంత గ్రామాలకు చేరుకున్న సందర్భంగా వారి ఆరోగ్య పరిస్థితి వారి పూర్తి వివరాలు సేకరిస్తూ వారికి తగు జాగ్రత్తలు చెప్పామని అన్నారు.

చిత్రం కుంట గ్రామానికి సంబంధించిన ఇద్దరు బయటి రాష్ట్రం నుండి ఒకరు విదేశాల నుండి ఒకరు వచ్చారని 14 రోజులు సెల్ఫ్ ఐసోలేషన్ లో ఉండాలని సూచించినట్లు తెలిపారు.

Related posts

ములుగు జిల్లా కుగ్రామంలో కూడా కరోనా పాజిటీవ్ కేసులు

Satyam NEWS

ముత్యపుపందిరివాహనంపై ఆదిలక్ష్మి దేవి అలంకారంలోఅలమేలుమంగ

Satyam NEWS

ఇంద్రకీలాద్రిపై వైభవంగా శ్రీపంచమి వేడుకలు

Satyam NEWS

Leave a Comment