39.2 C
Hyderabad
March 29, 2024 14: 10 PM
Slider వరంగల్

బాలాజీ విద్యాసంస్థ లో బాల్య వివాహాల పై అవగాహన సదస్సు

#childmarriage

బాలాజీ హైస్కూల్లో బాల్య వివాహాలు, బాలకార్మిక వ్యవస్థ పై ములుగు పోలీసు శాఖ వారిచే విద్యార్థులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ములుగు ఏ ఎస్ ఐ రవి మాట్లాడుతూ బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని అందుకు పాల్పడినవారు చట్టరీత్యా శిక్షించ పడతారని, అలాగే  బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని విద్యార్థుల ను ఉద్దేశించి తెలిపారు.

ఎలాంటి  అత్యవసర ఈ పరిస్థితులలోనైనా నెంబర్ వందకు(100) డయల్ చేయాలని, అంతేకాకుండా కుటుంబ  కలహాలు గొడవకు దారి తీసిన పుడు “సఖి” సహాయ కేంద్రాన్ని సంప్రదించవలసినదిగా కోరారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ కె రజనీకాంత్ మాట్లాడుతూ బాల్య వివాహాలు, బాల కార్మిక వ్యవస్థ ను అరికట్టడంలో  విద్యార్థుల పాత్ర ఎంతో కీలకమని విద్యార్థులకు తెలియజేశారు. ఇలాంటి అవగాహన సదస్సు తమ పాఠశాలలో నిర్వహించినందుకు పోలీస్ శాఖ వారికి  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఏవో వెంకటరమణ, ఉపాధ్యాయ బృందం, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

Related posts

చిన్న తిరుపతిలో వైభవంగా వేంకటేశ్వర కళ్యాణం

Satyam NEWS

సూర్యాపేట జిల్లాలో బర్డ్ ఫ్లూపై చెలరేగుతున్న భయాందోళన

Satyam NEWS

విధి నిర్వహణ పట్ల అలక్ష్యం వహిస్తే తక్షణమే తొలగించండి…!

Bhavani

Leave a Comment