33.2 C
Hyderabad
April 25, 2024 23: 19 PM
Slider వరంగల్

వినియోగదారుల చట్టాలపై అవగాహన కార్యక్రమం

#anaitareddy

జాతీయ వినియోగదారుల  హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర వైస్ చైర్మన్ డాక్టర్ అనితా రెడ్డి అధ్యక్షతన హనుమకొండ లోని సౄదార్ మహిళలకు  వినియోగదారుల హక్కుల చట్టం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. చట్టాలపై అవగాహన ద్వారా నే చైతన్యం సాధ్యం అని  అప్పుడే తమ హక్కులను వినియోగదారులు వినియోగించు కుంటారని అనితా రెడ్డి అన్నారు.

ఏ చిన్న వస్తువులను కొనుగోలు చేసిన బిల్లు తీసికొవాలని,  పెద్ద ఎత్తున తీసుకున్నప్పుడు గారంటీ కార్డు ను తీసికొవాలని,  సర్విస్ లో  ఇబ్బందులు ఎదురైనప్పుడు  వినియోగదారుల చట్టం వినియోగించుకోవాలని అనితా రెడ్డి అన్నారు. మహిళల వలనే అభివృద్ధి సాధ్యం అని అనితా రెడ్డి  తెలియచేశారు.

అనంతరం సౄదార్ మహిళల సౌకర్యార్ధం బియ్యం బస్తా లు, పప్పులు, నిత్యావసర వస్తువులను ఉచితంగా అందించారు. ఏ అవసరం ఉన్నా తమని సంప్రదించ వచ్చని తెలియచేశారు. జాతీయ వినియోగదారుల హక్కుల కమిషన్ ఆధ్వర్యంలో అవగాహన సదస్సులే కాక  సేవా,  సమాజ హిత కార్యక్రమాలు నిర్వహిస్తామని అనితా రెడ్డి తెలియచేశారు.    జిల్లా చైర్మన్ జైపాల్ రెడ్డి, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రెటరీ రాంరెడ్డి,  సెక్రటరీ సురేందర్, మహిళలు,పిల్లలు పాల్గొన్నారు.

Related posts

క్యాన్సర్ ఆసుపత్రిని సందర్శించిన బాలకృష్ణ

Satyam NEWS

శారదా విద్యాలయ శతాబ్ది వేడుకలు ప్రారంభం

Satyam NEWS

కాంతులీనుతున్న విజయనగరం ప్రభుత్వ కార్యాలయాలు

Satyam NEWS

Leave a Comment