బిచ్కుంద మండలంలోని గ్రామాలైన పెద్దదడిగి గోపన్పల్లి బండరెంజల్ పెద్దదేవాడ గ్రామాలలో కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా ఉండడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తల పట్ల గ్రామసభలు నిర్వహించారు. అనంతరం ఆయా గ్రామాల సర్పంచ్ లు మాట్లాడుతూ జన సంచారం లేని చోట ఉండాలని ప్రజలకు సూచించారు.
అత్య అవసరం అనుకుంటే శుభకార్యాలకు వెళ్లాలని లేని ఎడల వెళ్లకపోవడమే ఉత్తమమన్నారు. గ్రామాలలో హోటళ్లలో కల్లు దుకాణాలలో ప్రజలను ఒకే చోట కూర్చోకుండా నిర్వాహకులు ఏర్పాటు చేయాలన్నారు. లేకపోతే వైరస్ వ్యాప్తి చెందే అవకాశం ఉంటుందన్నారు.
చిన్నపిల్లల పట్ల వృద్ధుల పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని ప్రపంచాన్ని వణికిస్తున్న ఈ మహమ్మారి భయంకరమైనదని, ఎప్పటికప్పుడు సబ్బు లతో చేతులను శుభ్ర పరుచుకోవాలన్నారు. కళ్లు ముక్కు నోటిని తమ చేతులతో తాకరాదని ఇతరులను కూడా కరచాలనం చేయరాదన్నారు.
గొంతులో నొప్పి దగ్గు శ్వాస ఆడకపోవడం లాంటివి ఉంటే వెంటనే వెంటనే ఆసుపత్రికి వెళ్లి పరీక్షలు నిర్వహించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద దేవాడలో ఎస్సై కృష్ణ ఆయా గ్రామాల సర్పంచ్లు గోపన్పల్లి సర్పంచ్ శ్రీనివాస్ పంచాయతీ కార్యదర్శి మానస బండరెంజల్ సర్పంచ్ గడ్డం బాల్రాజ్ పంచాయతీ కార్యదర్శి అనిత పాల్గొన్నారు.
ఇంకా పెద్ద దడిగి ఉపసర్పంచ్ చిన్నమొల్ల సాయిలు పంచాయతీ కార్యదర్శి సాయిలు, పెద్దదేవాడ సర్పంచ్ శివానంద్ తో పాటు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులు ఆశా అంగన్వాడీ కార్యకర్తలు పంచాయతీ పాలకవర్గ సభ్యులు గ్రామస్తులు పాల్గొన్నారు.