36.2 C
Hyderabad
April 24, 2024 22: 37 PM
Slider ముఖ్యంశాలు

సైబర్ సేఫ్టీ పై జాన్సన్ గ్రామర్ స్కూల్ లో వర్క్ షాప్

#Cybher 1

సైబర్ సేఫ్టీ పై ప్రజలలో అవగాహన కల్పిస్తున్న తెలంగాణ పోలీసు మహిళా భద్రతా విభాగం నేడు జాన్సన్ గ్రామర్ స్కూల్ విద్యార్ధులకు ఒక ప్రత్యేక వర్క్ షాప్ నిర్వహించింది. హైదరాబాద్ లోని సింబయాసిస్ స్కూల్ కు చెందిన లీగల్ ఎయిడ్ సెంటర్ తో కలిసి తెలంగాణ పోలీసులు ఉమెన్ సేఫ్టీ వింగ్ నిర్వహించిన ఈ వర్క్ షాప్ లో విద్యార్ధినీ విద్యార్ధులు పాల్గొన్నారు.

ఉమెన్ సేఫ్టీ వింగ్ గత కొద్ది రోజులుగా cybHER – పాఠశాల పేరుతో అవగాహనా కార్యక్రమాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే. నేడు జరిగిన ఈ వర్క్ షాప్ లో సైబర్ నిపుణుడు రక్షిత్ టాండన్ పాల్గొన్నారు. ఇంటర్ నెట్ కు సంబంధించిన పలు అంశాలను ఆయన ఇందులో ప్రస్తావించి విద్యార్ధులకు అవగాహన కల్పించారు.

సైబర్ నేరాల పట్ల అవగాహన కలిగి ఉండటంతో బాటు భవిష్యత్తులో సాధించాల్సిన విజయాలకు కూడా సైబర్ విద్య ఎంతో అవసరమని ఆయన చెప్పారు. నెల రోజుల పాటు జరిగే ఈ సైబర్ అవగాహనా కార్యక్రమంలో పాల్గొనాలంటే వెంటనే www.cybher.in కు లాగిన్ కావాలి. ఇప్పటికే 9 వేల మంది ఈ క్యాంపెయిన్ లో పాల్గొంటున్నారు. మీరూ పాల్గొనండి.

Related posts

మ్యాడ్అట్ట్రాక్ట్:ఆకట్టుకోవాలనే నిత్యానంద ఫోటోతో పెళ్లిబ్యానర్

Satyam NEWS

సరెండర్:అసోంలో 644 మంది మిలిటెంట్ల లొంగుబాటు

Satyam NEWS

ఎన్కౌంటర్: ముగ్గురు ఉగ్రవాదుల్నిమట్టుపెట్టిన పోలీసులు

Satyam NEWS

Leave a Comment