37.2 C
Hyderabad
April 19, 2024 11: 20 AM
Slider జాతీయం

అయోధ్య రామాలయం ప్రధాన పూజారికి కరోనా

#Ayodhya Rama Mandir

ఆగస్టు 5న అట్టహాసంగా జరగబోతున్న అయోధ్య రామమందిర శంకుస్థాపన కార్యక్రమానికి ముందు ఒక అపశృతి చోటు చేసుకుంది. అయోధ్య రామాలయ ప్రధాన పూజారికి కరోనా పాజిటీవ్ వచ్చింది. దాంతో ఆయన ఐసోలేషన్ లోకి వెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది.

ఆయనను ఐసోలేషన్ లోకి తరలించిన తర్వాత అక్కడ భద్రతా ఏర్పాట్లలో నిమగ్నమై ఉన్న 16 మంది పోలీసులకు కూడా కరోనా పాజిటీవ్ వచ్చింది. ఆగస్టు 5న జరగబోయే శంకుస్థాపన కార్యక్రమంలో అయోధ్య రామాలయం ప్రధాన పూజారి ప్రదీప్ దాస్ ప్రముఖ పాత్ర పోషించాల్సి ఉంది.

ప్రధాని శంకుస్థాపన చేస్తున్నా ఇతర సాంప్రాదాయ విధానాలను ప్రదీప్ దాస్ చేయాల్సి ఉంది. అంతటి కీలక పాత్ర పోషించాల్సి ఉన్న ప్రదీప్ దాస్ కు కరోనా సోకడంతో ఇప్పుడు ఆలయ నిర్వాహకులు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు ప్రారంభించారు.

Related posts

చివరి ఆయకట్టుకు సాగు నీరు

Murali Krishna

విధి నిర్వహణలో మానవీయకోణం తో పనిచేయాలి

Satyam NEWS

రేపు ముస్లిం జేఏసీ ఆధ్వర్యంలో భారీ శాంతి ర్యాలీ

Satyam NEWS

Leave a Comment