“అయ్యా నిన్ను మరువను , అయ్యప్ప నిన్ను మరువను ” అంటూ అమెరికా, టెక్సస్ , మెగడోర్ స్ట్రీట్ , మనోర్ వద్ద నివసించే హైదరాబాదు కి చెందిన ఆనంద్ స్వామి.. తమ స్వగృహంలో భక్తిశ్రద్ధలతో అయ్యప్ప స్వామి పూజ నిర్వహించారు. అమెరికాలో అయ్యప్ప స్వామి మహా పడిపూజ కార్యక్రమాన్ని స్వామి దీక్ష చేపట్టి భక్తిశ్రద్ధ తో ఎంతో నిష్టగా ఘనంగా భజన కార్యక్రమాలచే పూజ నిర్వహించడం అనే గొప్ప సంస్కృతిని అమెరికాలోనూ అయ్యప్ప దీక్ష ఎంత భక్తితో జరుపుతారనేది హైదరాబాద్ కి చెందిన ఆనంద్ స్వామి కుటుంబ సభ్యులు జరిపిన మహత్కార్యం. గురుస్వామితో పాటు మాల ధారణ చేసిన స్వాములందరూ పూజా కార్యక్రమంలో పాల్గొనడం అనేది విశేషం.
previous post