28.7 C
Hyderabad
April 20, 2024 09: 58 AM
Slider ముఖ్యంశాలు

బాబా జీవితమే సమస్త మానవాళికి సందేశం

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా జీవన విధానమే సమస్త మానవాళికి ఆచరణీయమని చిన్మయ మిషన్ ఇంచార్జ్ ఆత్మ విధానంద స్వామిజీ అన్నారు. సాయి ట్రస్ట్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన భగవాన్ శ్రీ సత్య సాయి బాబా 97వ జన్మదిన సందర్భంగా ఏర్పాటు చేసిన నారాయణ సేవ కార్యక్రమానికి అయన ముఖ్య అతిధిగా పాల్గొని ప్రసంగించారు.

భగవంతుడు అనేవాడు కేవలం మహిమలను చూపడమే కాకుండా సమాజానికి సేవ చేయాలనీ ఈ సేవా కార్యక్రమాల ద్వారానే దాదాపు 186 దేశాలలోని భక్తులకు ఆరాధ్యదైవం అయ్యారని తెలిపారు. లక్షలాది మందికి విద్యాదానం చేయడమే కాకుండా కోట్లాది మందికి దాహం తీర్చి అపర భగిరధుడుగా లక్షలాది మందికి ఉచిత వైద్యo అందించి అపర ధన్వంతరిగా ప్రఖ్యాతి గాంచారని తెలిపారు. ప్రతి మనిషిలోను భగవంతుడు ఉన్నాడు, అది తను గుర్తుంచుకున్నాను కాబట్టే భగవంతుడిని అయ్యానని సమాజంలో అందరిపట్ల ప్రేమతత్వంతో మెలగాలని ఆయన బోధించారని తెలిపారు.

సాయి ట్రస్ట్ అద్యక్షుడు విజయసాయి కుమార్ మాట్లాడుతూ అనంతపురం జిల్లాకు తాగు నీరు అందించడం తో పాటు సూపర్ స్పెషాలిటి ఆసుపత్రి ని ప్రారంభించి పేద వారికి ఉచితంగా వైద్యం,విద్య అందించిన శ్రీ భగవాన్ శ్రీ సత్యసాయి బాబా స్ఫూర్తి తో మేము సాయి ట్రస్ట్ ద్వార ప్రతి నిత్యం ఎన్నో సేవ కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని త్వరలో ప్రతి ఇంటి నుంచి ఒకరికి అన్నదానం అనే నారాయణ సేవను కూడా ప్రారంభిస్తామని తెలిపారు. మనూరు నాగరాజు స్వామి వారి సతీమణి ఉమాదేవి పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ రోజు నారాయణ సేవకు తపోవనం సత్యసాయి కన్వినర్ రఘునాథ్ ,విజయలక్ష్మి శాస్త్రి, ఆర్ధిక సాయం అందించగా సాయి ట్రస్ట్ అద్యక్షుడు విజయ సాయి కుమార్, నారాయణ నాయక్, రాఘవేంద్ర,ఎల్.వి ప్రసాద్ ఆసుపత్రి సి.ఆర్.ఎస్ శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు.

Related posts

తెలంగాణ పోలీసులకు ఎన్‌హెచ్‌ఆర్‌సి నోటీసులు

Satyam NEWS

ఎస్ బి ఐ లోకి చొరబడ్డ దొంగలు: లాకర్ నుంచి సొమ్ము చోరీ

Satyam NEWS

ఈ గుండూ బాస్ ఎవరో గుర్తు పట్టగలరా?

Satyam NEWS

Leave a Comment