34.2 C
Hyderabad
April 19, 2024 22: 50 PM
Slider జాతీయం

బాబ్రీ విధ్వంసం కేసును కొట్టేసిన లక్నో సీబీఐ కోర్టు

#BabriMasjid

బాబ్రీ మసీదు కూల్చి వేత ఒక కుట్ర ప్రకారం జరిగింది ఆరోపిస్తూ దాఖలైన కేసును సీబీఐ కోర్టు కొట్టివేసింది. స్పెషల్ సీబీఐ కోర్టు న్యాయమూర్తి ఎస్ కె యాదవ్ బాబ్రీ మసీదు కూల్చివేత కేసులోని అందరు నిందితులను నిర్దోషులుగా తేల్చారు.

1992 డిసెంబర్ 6న హిందూ కర సేవకులు బాబ్రీ మసీదును కూల్చి వేసిన విషయం తెలిసిందే. రాముడు జన్మించిన స్థలంలో ఉన్న దేవాలయాన్ని కూలగొట్టి బాబ్రీ మసీదు నిర్మించారని చెబుతూ కరసేవకులు దాన్ని కూల్చి వేశారు. ఈ కేసును త్వరితగతిన పూర్తి చేయాలని సుప్రీంకోర్టు పలుమార్లు ప్రత్యేక కోర్టుకు సూచించింది.

బాబ్రీ మసీదు కూల్చి వేత ఒక కుట్ర ప్రకారం జరిగిందని ముందు నుంచి చెబుతూ వస్తుండగా అలహాబాద్ హైకోర్టు అలాంటిదేం లేదని చెప్పింది. అయితే అలహాబాద్ హైకోర్టు తీర్పు పై సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది.

ఈ తరహా కేసులను కూలంకషంగా విచారించేందుకు లక్నో లోని సీబీఐ కోర్టు ను సుప్రీంకోర్టు ఆదేశించింది. రోజు వారీ విచారణ నిర్వహించి రెండు సంవత్సరాలలో కేసును పూర్తి చేయాలని కూడా సుప్రీంకోర్టు కింది కోర్టుకు ఆదేశాలిచ్చింది.

 బీజేపీ అగ్ర నాయకుడు ఎల్ కె అద్వానీ బాబ్రీ మసీదు కుట్ర కేసులో నిందితుడు కాగా, తాము ఎలాంటి కుట్రకు పాల్పడలేదని ఆయన ముందు నుంచి చెబుతూ వస్తున్నారు.

కేవలం రాజకీయ కారణాలతోనే కేసును నమోదు చేసి కొనసాగిస్తున్నారని ఆయన కోర్టుకు వివరించారు. బీజేపీ అగ్ర నేతలు మురళీ మనోహర్ జోషి, ఉమాభారతి కూడా నేటి తీర్పుతో బాబ్రీ మసీదు కూల్చివేత కేసు నుంచి విముక్తి అయ్యారు.

Related posts

ప్రొటెస్టు: దేవదేవుడి ఆస్తులు అమ్మవద్దు

Satyam NEWS

కుటుంబ సభ్యుల మధ్య బాలకృష్ణ జన్మదినం

Satyam NEWS

కొల్లాపూర్ లో పట్టుబడిన ఇసుక ట్రాక్టర్లు

Satyam NEWS

Leave a Comment