27.7 C
Hyderabad
March 29, 2024 03: 00 AM
Slider మహబూబ్ నగర్

వనపర్తి జిల్లా కేంద్రంలో బాబు జగ్జీవన్ రామ్ జయంతి

#wanaparthy

వనపర్తి జిల్లా కేంద్రంలో రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ 115 వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి, వనపర్తి జిల్లా కలెక్టర్ యస్మిన్ భాష తదితరులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో తెలంగాణ దండోరా వ్యవస్థాపక అధ్యక్షులు మీసాల రాము మాదిగ కూడా పాల్గొన్నారు.

ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బాబూ జగ్గీవన్ రామ్ దళిత జాతిలో పుట్టి అతి చిన్న వయసులోనే శాసనసభకు ఎన్నికై 40 సంవత్సరాలు కేంద్రమంత్రిగా ఎన్నో పదవులు చేపట్టి రాజకీయంగా ఎదిగి భారత దేశ ఉప ప్రధాన మంత్రిగా ఆయన ఎన్నో సేవలు చేశారని అన్నారు.

జిల్లాలో దళితులు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్కరించాలని ఆయన మంత్రిని, జిల్లా కలెక్టర్ ను కోరారు. కొత్తకోట కు తరలించిన  ఎస్సీ గురుకుల హాస్టల్ ను తక్షణమే  వీపనగండ్ల కు మార్చాలని ఆయన అన్నారు. అదేవిధంగా తెలంగాణ దండోరా ఆధ్వర్యంలో చేపట్టిన మాదిగవాడలో  పల్లెనిద్ర కార్యక్రమంలో వెలుగులోకి వచ్చిన  ఎస్సీ హాస్టల్ లో ఉండే వివిధ సమస్యలను మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు.

వీపనగండ్ల కు మంజూరు అయిన ఎస్ సి గురుకుల పాఠశాలను అనివార్య కారణాల వల్ల కొత్తకోటకు తరలించడం జరిగిందని అయితే త్వరలోనే ఎస్ సి గురుకుల పాఠశాల మార్పు జరుగుతుందని కలెక్టర్ యాస్మిన్ భాష అన్నారు. పల్లెనిద్ర కార్యక్రమంలో  వివిధ అంశాలను పరిష్కరిస్తామని, ఎస్సి హాస్టల్ లో ఇంకా ఏమైనా సమస్యలు ఉన్నా కూడా తక్షణమే పరిష్కరిస్తామని వ్యవసాయ శాఖ మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి తెలిపారు.

ఈ కార్యక్రమంలో SC, ST విజిలెన్స్ కమిటీ మేంబర్ గంధం నాగరాజు మాదిగ, కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి దయ్యపు రాధాకృష్ణ లతో పాటు MRPS, KVPS, బుడగ జంగాల, మాల మహానాడు వివిధ  సంఘాల నాయకులు, వివిధ రాజకీయ పార్టీ నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts

నో ఫెస్టివల్: భోగిమంటల్లోజీఎన్‌రావు బోస్టన్‌ నివేదికప్రతులు

Satyam NEWS

IND vs PAK T20: పాకిస్తాన్ పై ఆఖరి బంతి విజయం

Satyam NEWS

ఐపీఎల్ పోటీలోకి మ‌రో బాలీవుడ్ జంట ఎంట్రీ..

Sub Editor

Leave a Comment