18.3 C
Hyderabad
December 6, 2022 05: 55 AM
Slider కృష్ణ

అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన బాబు రాజేంద్ర ప్రసాద్

#baburajendraprasad

అమెరికా పర్యటనను దిగ్విజయంగా ముగించుకొని స్వదేశానికి తిరిగి వచ్చిన తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బాబు రాజేంద్రప్రసాద్ కు పార్టీ నాయకులు,కార్యకర్తలు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. గన్నవరం ఎయిర్పోర్ట్ లో, కంకిపాడు మండల సెంటర్లలో తెదేపా నాయకులు, అభిమానులు  శాలువాలు, పూలమాలలతో ఘనంగా  స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు.

ఈ సందర్భంగా బాబూ రాజేంద్ర ప్రసాద్ మాట్లాడుతూ మీ అందరి ఆధరాభిమానాలకు కృతజ్ఞుణ్ణి అని, ఈ రెండు నెలల అమెరికా పర్యటనలో ఎన్నారై టిడిపి, తానా మరియు ఇతర సంఘాల ఆధ్వర్యంలో నిర్వహించిన  మీట్ అండ్ గ్రీట్ మరియు అనేక కార్యక్రమాల్లో పాల్గొన్నట్లు చెప్పారు. అమెరికాలోని వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ,  రాబోయే ఎన్నికల్లో ఎన్నారై టిడిపి నాయకులు మరియు ఆంధ్రప్రదేశ్ కు చెందిన ఎన్ఆర్ఐలు  ఆంధ్రప్రదేశ్ కు  వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి కృషి చేయాలని కోరడం జరిగిందని ఆయన తెలిపారు.

దానికి ఎన్నారై టిడిపి నాయకులు, తటస్తులు  స్పందిస్తూ తప్పకుండా రాబోయే ఎన్నికల్లో  ఆంధ్ర ప్రదేశ్ కు వచ్చి తెలుగుదేశం పార్టీ విజయానికి అన్ని విధాలుగా  మా సహాయ సహకారాలు అందిస్తామని వారు హామీ ఇవ్వడం సంతోషకరమని రాజేంద్రప్రసాద్ అన్నారు. ఈ సందర్భంగా తన అమెరికా పర్యటనలో వివిధ రాష్ట్రాల్లో ఐటీ, విద్య, వ్యవసాయం, సాంఘిక, సామాజిక మొదలగు అంశాలను అధ్యయనం చేసి అనేక విషయాలను తెలుసుకోవడం జరిగిందని రాజేంద్రప్రసాద్ పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో రాష్ట్ర బీసీ సాధికార కన్వీనర్ జంపన వీర శ్రీనివాస్, రాష్ట్ర మైనార్టీ సెల్  కార్యదర్శి సయ్యద్ అజ్మతుల్లా,  రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి రాజులపాటి ఫణి, కంకిపాడు మండల పార్టీ అధ్యక్షులు సూది మల్ల రవీంద్ర, కంకిపాడు టౌన్ ప్రధాన కార్యదర్శి విక్రం,10 వార్డ్  కౌన్సిలర్ పలియాల శ్రీనివాస్, పరిమి భాస్కర్,బూరెలు నరేష్, భాగ్యరాజ్, చలపాటి శ్రీను,షఫీ, యేనుగ జయ, గోగినేని రమణ, కొండా నాగేశ్వరరావు, కన్నయ్య, శివపార్వతి  తదితరులు పాల్గొన్నారు.

Related posts

ఏబీఎస్ వృద్ధాశ్రమంలో భూషణ్ రాజు జన్మదిన వేడుకలు

Satyam NEWS

అంబర్ పేట్ లో నూతన డ్రైనేజీ పనులకు శంకుస్థాపన

Bhavani

ప్రభుత్వ ఆసుపత్రులలో కరోనా టీకా ఉచితం

Satyam NEWS

Leave a Comment

error: Content is protected !!